దర్శకధీరుడు రాజమౌళికి ఉన్న పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఇదే…!

శాంతినివాసం అనే సీరియల్ ద్వారా డైరెక్షన్ లోకి అడుగుపెట్టిన రాజమౌళి తన డైరెక్షన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత ఎన్టీఆర్ తో కలిసి ‘ స్టూడెంట్ నెంబర్ 1 ‘ సినిమా రూపొందించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. రాజమౌళి డైరెక్ట్ చేసిన మొదటి సినిమానే సూపర్ హిట్ కావడంతో మంచి క్రేజ్‌ సంపాదించుకుని.. నాటి నుంచి నేటి వ‌ర‌కు అదే ఫామ్ తో దూసుకుపోతున్నాడు రాజమౌళి.

అత‌డు తెర‌కెక్కించిన సినిమాలలో ఒక్క ప్లాప్ సినిమా లేదంటే ఆయన సినిమాల విషయంలో ఎంత పర్ఫెక్ట్ గా ఉంటాడో అర్థం చేసుకోవచ్చు. రాజమౌళి చివరిగా తెరకెక్కించిన ‘ ఆర్‌ఆర్ఆర్ ‘ సినిమాకి ఏకంగా కోట్లాదిమంది ఫ్యాన్స్ తో పాటు, గ్లోబల్ స్టార్ అవార్డు, ఆస్కార్ అవార్డు కూడా వరించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రాజమౌళి పేరు మోత మోగిపోతుంది.

ఎంతో టాలెంట్ ఉన్న రాజమౌళికి ఓ బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందట. అదే కోపం.. రాజమౌళికి కోపం వస్తే అసలు త‌న‌ని తాను కంట్రోల్ చేసుకోలేడ‌ట. ఎదుట ఉన్నవారు ఎంతటి వాడైనా సరే చివరికి తన దగ్గర బంధువులైనా.. తన ఆత్మీయులైనా సరే వారిపై కోపం చూపించేయాల్సిందేన‌ట‌. పక్కన ఏ వస్తువు ఉంటే ఆ వస్తువు పగిలిపోవాల్సిందేనట. అలా విసిరి కొట్టేస్తాడ‌ట‌.

నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడ‌ట. కోపం తగ్గిన కొంచెం సేపటి తరువాత ఆయన ఏమన్నాడో రియలైజే అయ్యో ఇలా అనేసానే అని బాధపడతాడట‌. అయితే ఇది బ్యాడ్ హాబిట్టా ? మనందరిలో కామన్ గా ఉండేదేగా అని చాలామంది అనుకోవచ్చు.. కానీ రాజమౌళి లాంటి ఓ టాప్ డైరెక్టర్ కూడా తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడా అంటూ హ్యూమ‌న్ ఎమోష‌న్లు అంద‌రికి కామ‌నేగా అనుకోవాల్సిందేమో ?