చిత్ర పరిశ్రమలో ప్రస్తుత కాలంలో విడాకులు అన్నమాట ఎంతో కామన్ గా మారిపోయింది. మరీ ముఖ్యంగా స్టార్ సెలబ్రెటీలు వరుసగా విడాకులు తీసుకుని సోషల్ మీడియాని షేక్ చేస్తున్నారు. ఎప్పుడు ఎవరు ఎవరితో కలిసుంటారో ? ఎప్పుడు విడిపోతారో తెలియడం లేదు. అంతేకాకుండా వారి అభిమానులకి తీరని బాధ మిగులుస్తున్నారు.
కారణం ఏమిటో తెలియదు కానీ చిత్ర పరిశ్రమలో ఉండే పెద్ద పెద్ద ఫ్యామిలీకి చెందిన అమ్మాయిలు కూడా విడాకులు తీసుకోవడం ఇప్పుడు ఎంతో హాట్ టాపిక్ గా మారింది. ఇక తాజాగా మెగా డాటర్ నిహారిక సైతం తన భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది. ఆ అప్డేట్ కూడా అధికారికంగా ప్రకటించింది.
ఇదే సమయంలో ఇప్పుడు టాలీవుడ్‌లో ఉండే మరో స్టార్ హీరోయిన్ కూడా విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అవును మీరు వింటున్నది నిజమే.. తెలుగులోనే స్టార్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఓ ముద్దుగుమ్మ.. ఇప్పటికే తన భర్తకు దూరంగా ఉంటుంది. అంతేకాకుండా విడాకుల కోసం ఇప్పటికే కోర్టులో పిటిషన్ కూడా వేసిందట.
త్వరలోనే దీనిపై క్లారిటీ కూడా రాబోతుంది అంటు ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో హాట్ టాపిక్ గా మారింది. కాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ స్టార్ హీరోయిన్ కూడా తన భర్తతో వచ్చిన మనస్పర్ధల కారణంగానే విడాకులు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తుంది. ఇప్పుడు దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఓ స్టార్ హీరోయిన్ విడాకులకు సిద్ధంగా ఉందనే వార్తలు బాగా వినిపిస్తున్నాయి.