2023 – 24 సీజన్ లో మోస్ట్ అవైటెడ్ సినిమాలు ఏంటి అనే ప్రశ్నకు తాజాగా ఓర్మాక్స్ సంస్థ సర్వే ప్రకారం సమాధానం లభించింది. ఈసారి మోస్ట్ అవైటెడ్ మూవీస్ లిస్టులో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ నటించిన ‘ సల్లార్ ‘ మొదటి స్థానంలో నిలువగా, అల్లు అర్జున్ ‘ పుష్ప2 ‘ ది రూల్ సినిమా రెండవ స్థానంలో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ ఓజి ‘ మూడో స్థానంలో, మహేష్ బాబు నటించిన ‘ గుంటూరు కారం ‘ 4వ స్థానంలో, ఎన్టీఆర్ నటిస్తున్న ‘ దేవర ‘ ఐదో స్థానంలో నిలిచాయి.
ఓర్మాక్స్ సంస్థ ఈ సర్వేను గూగుల్ సెర్చ్ సహా అభిమానుల్లో క్రేజీని బేస్ చేసుకుని, పరిశ్రమలో టాక్ ఇలా కొన్ని అంశాల పరిగణలోనికి తీసుకుని రిపోర్ట్ అందించింది. ఆసక్తికరంగా ఈ సర్వేలో ప్రభాస్ ‘ సలార్ ‘ నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇటీవల ‘ ఆదిపురుష్ ‘ రిలీజై ఫ్లాప్ గా నిలిచినా ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు అనడానికి ఇది ఉదాహరణ. దీంతోపాటు ‘కేజీఎఫ్ ‘ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో మరింత ఆసక్తి పెరిగింది.
దీని తరువాత సెకండ్ స్థానంలో నిలిచింది ‘ పుష్ప 2 ‘ . ఇప్పటికే పుష్ప 1 సినిమా రిలీజ్ అయి ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది. ఈ కారణంతోనే ‘ పుష్ప 2 ‘ సినిమా కోసం ప్రేక్షకులు ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఓ రేంజ్ లో ఆసక్తి చూపుతున్నారు వారి భాషలోని సినిమాలను వదిలేసి పుష్ప 2 కోసం ఆసక్తిగా ఎదురుచూడడం అందరికీ ఆశ్చర్యాన్ని కల్పిస్తుంది. ఈ రెండు సినిమాల తరువాత పవన్ కళ్యాణ్ ‘ ఓజి ‘ సినిమా మూడో స్థానం దక్కించుకుంది.
మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోల సినిమాలను వదిలేసి పవన్ కళ్యాణ్ సినిమాకు అంత క్రేజ్ దక్కడం విశేషం. ఇక నాలుగో స్థానంలో మహేష్ బాబు ‘ గుంటూరు కారం ‘, 5వ స్థానంలో ‘ దేవర ‘ హైప్ సాధించాయి. ఇక హిందీ పరిశ్రమకు వస్తే షారుఖ్ ఖాన్ ‘ పఠాన్ ‘ మొదటి స్థానంలో ఉండగా తరువాతి స్థానంలో ‘ పుష్ప 2 ‘ సినిమా ఉండడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికే బాలీవుడ్ లోని ఎంతోమంది అగ్రతారల సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉండగా ఈ సినిమాల కంటే ఎక్కువగా పుష్ప 2 సినిమా ఆదరణ పొందడం విచిత్ర పరిణామం.