మామూలుగా మన ఇళ్లల్లో చిన్న చిన్న కలతలు వుంటే కాస్త మనసుకు కష్టంగానే వుంటుంది. అలాంటిది ఇప్పుడు టాలీవుడ్‌లో ఓ బడా ఫ్యామిలీ ఇంటికి కోడలు కాబోతోన్న హీరోయిన్ కూడా మనసంతా చికాకుగానే ఉన్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. సదరు హీరోయిన్ ఆ పెద్ద ఫ్యామిలీ హీరోను ప్రేమించింది.. గ్రాండ్‌గా ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.
ఈ ఎంగేజ్మెంట్ జరిగి కూడా కొద్ది రోజులే అవుతోంది. ఇంతలోనే సదరు హీరో ఇంట్లో కలతలు మొదలయ్యాయి. హీరో చెల్లి భర్త నుంచి విడాకులు తీసేసుకుంది. దీంతో సదరు హీరో ఫ్యామిలీ తమకు కాబోయే కోడలు అయిన ఆ హీరోయిన్‌కు అప్పుడే కండీషన్లు పెట్టడం మొదలు పెట్టేశారట. ఇప్పుడు ఆ ఇంట్లో కూడా సినిమా రంగంలో ఉన్న అమ్మాయిని కోడలిగా చేసుకోవడం అవసరమా ? అన్న డిస్కర్షన్లు మొదలయ్యాయట.
ఈ క్రమంలోనే పెళ్లి తర్వాత అలా ఉండాలి.. ఇలా ఉండాలి అన్న కండీషన్లు అయితే మొదలైపోయాయట. ఇంకేముంది.. ఇవన్నీ సదరు హీరోయిన్‌కు కాస్త ఇబ్బందిగా ఉంటున్నాయట. ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్లయ్యాక ఇంకెలా ఉంటుందో అని ఆమె ఫీల్ అవుతోందట. ఇవన్నీ నాకు అవసరమా.. అంటూ ఆమె విసిగిపోతోందంటున్నారు.
అందుకే తన పెళ్లి విషయంలో ఆమె పునరాలోచనలో కూడా పడిందంటున్నారు. ఏదేమైనా ఆమె నిర్ణయంలో ఎప్పుడు ఎలాంటి మార్పు అయినా ఉండొచ్చంటున్నారు. అదే జరిగితే ఆ హీరో, హీరోయిన్ పెళ్లికి ముందే బ్రేకప్ చెప్పుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఆ ఫ్యామిలీ పరువు మరింత బజారున పడడం ఖాయం.
వాస్తవంగా మాత్రం ఆ హీరో, హీరోయిన్ ప్రేమలో స్వచ్ఛత ఉండడంతో వాళ్లిద్దరు అవేవి పట్టించుకోకుండా త్వరలోనే పెళ్లి చేసుకుని కాపురం ప్రారంభించాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.