ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరోలు వరుసగా పెళ్లిళ్లు చేసుకుని ఒకరి తర్వాత ఒకరు ఫ్యామిలీ లైఫ్ లోకి అడుగుపెడుతున్నారు. మరి ప్రధానంగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అనే బేధం లేకుండా స్టార్ హీరోలు బ్యాక్ టు బ్యాక్ వారి పెళ్లిళ్లు విషయాలు చెబుతూ అభిమానులకి భారీ సర్ప్రైజ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో ఉన్న శర్వానంద్ ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్‌లో అడుగు పెట్టాడు.
మరో యంగ్ హీరో వరుణ్ తేజ్ కూడా ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకుని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇదే క్రమంలో మిగతా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ హీరోల పెళ్లి వార్తలు కూడా ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే యంగ్ హీరో అడివి విశేష్, అక్కినేని మేనకోడలు సుప్రియ యార్లగడ్డను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
ఇదే సమయంలో మరో యంగ్ హీరో రామ్ పోతినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నాడన్నదే ఇప్పుడు హాట్ టాపిక్? ప్రస్తుతం రామ్.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తన 20వ సినిమా చేస్తున్నారు. ఇక హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తెను ఈ యంగ్ హీరో పెళ్లి చేసుకోబోతున్నాడట. అంతేకాకుండా ఆమె కూడా మంచి బిజినెస్ ఉమెన్ అని… వ్యాపార విషయాల్లో ఆమెకు గట్టి పట్టు ఉందని కూడా తెలుస్తోంది.
రామ్ పెళ్లి పెద్దలు కుదిర్చిన వివాహం అని తెలుస్తోంది. అంతేకాకుండా వీరి పెళ్లికూడా ఈ ఏడాది చివర్లోనే జరగనుందట. ప్రస్తుతం రామ్ చేస్తున్న సినిమాల షూటింగ్ అయిపోగానే వీరి ఎంగేజ్మెంట్ పై అధికార ప్రకటన కూడా రాబోతుందట. ఈ న్యూస్‌పై రామ్ ఇప్పటికీ ఎటువంటి కామెంట్ చేయకపోవడంతో.. ఇది నిజమే అని రామ్ అభిమానులు అంటున్నారు.