సినిమా ఇండస్ట్రీలో అఫైర్లనేవి చాలా కామన్ అయిపోయాయి. హీరో హీరోయిన్ల మధ్య, డైరెక్టర్ హీరోయిన్ల మధ్య, ప్రొడ్యూసర్ హీరోయిన్ల మధ్య, క్యారెక్టర్ ఆర్టిస్టుల మధ్య ఇలా చెప్పుకుంటూ పోతే ఎవరు ఎవరినీ వదలడం లేదు. అయితే డైరెక్టర్లు – హీరోయిన్ల మధ్య మొదలయ్యే అఫైర్లు ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నిలుస్తుంటాయి. కాగా టాలీవుడ్‌లో చాలామంది దర్శకులు తమ సినిమాలలోని హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్నారని గుసగుసలు వినిపించాయి. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం.
• పూరీ జగన్నాథ్
ఇడియట్, పోకిరి, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ యాక్షన్ సినిమాల లెవెల్ పెంచేశాడు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. అయితే ఈ దర్శకుడు పోకిరి సినిమా టైమ్‌లో ఇలియానాతో రొమాంటిక్ రిలేషన్‌షిప్ పెట్టుకున్నట్లు వార్తలు వినిపించాయి. తర్వాత జ్యోతిలక్ష్మి సినిమా తీస్తున్నప్పుడు ఛార్మితో పూరీ జగన్నాథ్ అఫైర్ స్టార్ట్ చేసినట్టు పుకార్లు షికారు చేశాయి.
పూరీ స్టైల్, భావాలు, ఇంకా డైరెక్షన్ స్కిల్స్ నచ్చేయడంతో ఈ ముద్దుగుమ్మ అతనితో కమిట్ అయినట్లు గుసగుసలు వినిపించాయి. ఇక వీరిద్దరూ మొన్నటిదాకా కలిసి పనిచేయడం కూడా ఆ రూమర్స్‌కి ఆజ్యం పోసాయి. ఈ అఫైర్ వల్ల పూరీ కట్టుకున్న భార్యతో విడాకులు దాకా కూడా వెళ్లినట్లు రూమర్స్ వినిపించాయి.
• బోయపాటి శ్రీను
సింహా, లెజెండ్, అఖండ సినిమాలతో బ్లాక్‌బస్టర్ హిట్స్ కొట్టిన డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా తన సినిమాలలో నటించే నటీమణిలపై కన్నేస్తాడనే టాక్ ఉంది. అయితే ఇతగాడు ప్రవీణతో సంబంధం పెట్టుకున్నట్టు శ్రీరెడ్డి గతంలో ఆరోపణలు చేసింది. తన సినిమాలలో ఎక్కువగా కనిపించే ప్రవీణతో బోయపాటి సీక్రెట్‌గా రాసలీలలు చేశాడని కూడా ఆమె ఆరోపించింది.
• త్రివిక్రమ్ శ్రీనివాస్
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం ఈ లిస్టులో ఉన్నాడు. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ జల్సా సినిమా డైరెక్టర్ చేస్తున్నప్పుడు అందులో ఇలియానా స్నేహితురాలిగా నటించిన పార్వతి మెల్టన్‌తో అఫైర్ నడిపించినట్లు వార్తలు వచ్చాయి. నిజానికి సినిమాల్లోకి రాకముందు పార్వతి మెల్టన్ త్రివిక్రమ్ ఆఫీస్ పైన యోగా క్లాసులు చెప్పేదట.
ఆ టైమ్‌లో వీరి మధ్య ఆఫర్ మొదలైనట్లు సమాచారం. అ ఆ! సినిమా సమయంలో సమంతతో, అరవింద సమేత మూవీ సమయం నుంచి పూజా హెగ్డేతో త్రివిక్రమ్ రిలేషన్షిప్ కొనసాగిస్తున్నట్లు రూమర్స్ ఉన్నాయి. అలానే సంయుక్త మీనన్‌తో కూడా త్రివిక్రమ్‌కు అఫైర్‌ను అంటగట్టారు.
• వి.వి వినాయక్
వి.వి వినాయక చెన్నకేశవరెడ్డి సినిమా సమయంలో శ్రియ శరణ్‌తో సంబంధం పెట్టుకున్నట్టు రూమర్స్ వ్యాపించాయి.
• అనిల్ రావిపూడి
అనిల్ రావిపూడి తన సుప్రీమ్ సినిమాలో హీరోయిన్ గా చేసిన రాశీఖన్నాతో రిలేషన్ పెట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
• శేఖర్ కమ్ముల
తెలుగు సినిమాలకు పేరుగాంచిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కమలినీ ముఖర్జీ, ప్రియా ఆనంద్‌లతో సంబంధం పెట్టుకున్నాడని సినీ సర్కిల్లో గాసిప్స్ వచ్చాయి.