క‌త్తిలాంటి ఫిగ‌ర్లు అయిన ఈ 4గురు హీరోయిన్లు ఆ ఒక్క విష‌యంలో అస్స‌లు త‌గ్గ‌రా…!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల‌కి ఒక్కొక్కరికి ఒక్కో ఫాలోయింగ్ ఉంది. అయితే పాపులారిటీ ఉన్న కొంద‌రు స్టార్ హీరోయిన్లు కూడా కొన్ని విష‌యాల్లో చాలా వైల్డ్ గా బిహేవ్ చేస్తార‌న్న ముద్ర ప‌డిపోయింది. మ‌రి ఆ హీరోయిన్లు ఎవ‌రో చూద్దాం.

నయనతార:
పైకి చాలా అందంగా కనిపించే నయనతార రెమ్యూనిరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గదు. సినిమా కమిట్ అయ్యే ముందు ఏ పేమెంట్ అయితే మాట్లాడుకుంటారో ఆ పేమెంట్ ఆమెకు ముందే ఇవ్వాల్సిందే అంట. ఇవ్వకపోతే షూటింగ్‌కు రాన‌ని మెండికేసేస్తుంద‌ట‌.

సమంత:
ఇండస్ట్రీలో చాలా కూల్ అండ్ స్టైలిష్ బ్యూటీగా పేరున్న సమంత డబ్బు విషయంలో మాత్రం తగ్గేదేలే అంటుందట. ఎంత కూల్ గా ఉన్నా రెమోనరేషన్ విషయంలో మాత్రం ఏమాత్రం తగ్గదట ఈ బ్యూటీ.

తమన్నా:
ఈ మిల్కీబ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందరిలా కోపంతో కాదు…. మంచితనంతో మార్కులు సంపాదిస్తుంది. సినిమాకు తాను అనుకున్న రెమ్యునరేషన్ రాబట్టుకోవడంలో తమన్నా తర్వాతే ఎవరైనా అని ఇండ‌స్ట్రీ జ‌నాలు అంటారు.

కీర్తి సురేష్:
ఈ బ్యూటీ నిన్న మొన్నటి వరకు మహానటిగా పాపులారిటీని సంపాదించుకుని ఇప్పుడు మోడల్ మహానటి గా మారిపోయింది. నిన్న మొన్నటి వరకు డ‌బ్బుల గురించి మాట్లాడని కీర్తి ఇప్పుడు మాత్రం నిర్మాత‌ల ముక్కు పిండి మరి వ‌సూలు చేస్తుంది. ఇలా కీర్తి సురేష్ కూడా రెమ్యూన‌రేషన్ విషయంలో మహా కఠినంగా ఉంటుంద‌ట‌.

పూజ హెగ్డే:
పూజ హెగ్డే కూడా రెమ్యూనరేషన్ విషయంలో అసలు తగ్గదట. ఇప్పటివరకు మూడు సినిమాల‌కి సైన్ చేయన పూజ ఇప్పుడు ఒక్కో సినిమాకు మూడు కోట్ల రెమ్యూనిరేషన్ అడుగుతుందట. రెమ్యున‌రేష‌న్ విష‌యంలో పూజా కూడా అస్స‌లు త‌గ్గదంటారు.