టాలీవుడ్ హీరోలలో ధ‌న‌వంతుడు ఎవ‌రంటే.. ఆ హీరో టోట‌ల్ ఆస్తి అన్ని వేల కోట్లా…!

టాలీవుడ్ లో ఎందరో ? హీరోలు ఉన్నారు. కానీ అందులో కొంతమంది మాత్రమే టాప్ 1 లో కొనసాగుతుంటే… మరికొందరు టాప్ 2 స్థానంలో కొనసాగుతున్నారు. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి హీరోలు పాన్ ఇండియా స్టార్స్ గా కొనసాగుతున్నారు. ఒక్కో సినిమాకు రు.50 – 80 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఈ హీరోల‌లో అందరు హీరోలు కన్నా ధనవంతుడు ఎవరో తెలుసా…? యంగ్ జనరేషన్ హీరోలైతే కాదు. ఆ హీరో ఎవరో కాదు అక్కినేని నాగార్జున.

నాగార్జున‌ ఆస్తులు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు. అక్కినేని నాగేశ్వరరావు కుమారుడు అక్కినేని నాగార్జున ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా తనదైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. నాగార్జున టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ పలు సినిమాలు చేశాడు. నటుడుగా, సక్సెస్ నిర్మాతగా,హోస్ట్ గా, వ్యాపారవేత్త గా తన సత్తా చాటుకున్నాడు.

ఈ క్రమంలోని భారీగా సంపాదించాడు. నాగార్జున మొత్తం ఆస్తులు విలువ రూ.3, 010 కోట్లు. ఈయన ఆస్తులతో పోలిస్తే మిగతా హీరోల‌ ఆస్తులు నాగార్జున ఆస్తులకు ఒక మూలకు కూడా సరిపోవట. నాగార్జున తరువాత టాలీవుడ్ లో హీరోల్లో అత్యంత ధనవంతుడు ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి. చిరు ఆస్తుల విలువ మొత్తం రూ.1, 650 కోట్ల ఉంటుందట. ఇంక మూడో స్థానంలో రామ్ చరణ్ ఉన్నాడు.

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నా రామ్ చరణ్ రూ.1370 కోట్లకు అధిపతి. వీరి తర్వాత స్థానంలో ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్, వెంకటేష్ ఉన్నారు.