టాలీవుడ్‌లో నెక్ట్స్ జ‌న‌రేష‌న్ స్టార్ కిడ్స్ వీళ్లే.. ఆ స్టార్ హీరోల పిల్ల‌ల‌ ఎంట్రీ ప‌క్కా..!

ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రేక్షకుల అభిరుచుల్లో పూర్తిగా మార్పులు వచ్చాయి. కథ బాగుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా ఎలాంటి సినిమా అయినా సూపర్ డూపర్ హిట్ చేస్తూ పాపులారిటీ పెంచేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు సెలబ్రిటీస్ పిల్లలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి క్రేజ్ సంపాదించుకుంటున్నారు. అందుకే చైల్డ్ ఆర్టిస్టులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరో, హీరోయిన్లతో సమానంగా పోటీపడి మరీ సత్తా చాటుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో టాలీవుడ్ ను ఏలడానికి సిద్ధంగా ఉన్న స్టార్ కిడ్స్ ఎవరో ఒకసారి చూద్దాం.

అల్లు అర్హ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇక తాజాగా ఎన్టీఆర్ నటిస్తున్న దేవర‌ సినిమాలో కూడా అర్హ నటిస్తుంది. శకుంతలం సినిమాలో అర్హ నటనకు మంచి మార్కులు రావడంతో ఈమె ఖచ్చితంగా ఫ్యూచర్లో స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంటుంద‌ని చాలామంది సినీ ప్రముఖులు మెచ్చుకుంటున్నారు.

సితార :
సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార ఇప్పటికే పి ఎం జి జ్యువెలరీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి న్యూయార్క్ టైం స్క్వేర్స్ లో ప్రదర్శించబడి రికార్డులు సృష్టించింది. ఈ ఫొటోల‌లో ఆమె అద్భుతంగా ఒక లిటిల్ ప్రిన్సెస్ లా కనిపిస్తుంది. దీంతో పాటే మహేష్ బాబు 29వ‌ సినిమాలో నటించడానికి సిద్ధమయింది. అంతకుముందే సర్కారు వారి పాట సినిమాలో పెన్ని పాటకు సితార డాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ :
నందమూరి న‌టసింహ బాలయ్య నటవారసత్వంతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మోక్షజ్ఞ. ఇప్పటికే మోక్షజ్ఞ పలు సినిమాల్లో నటించడానికి కథ కూడా సిద్ధమైంద‌ని కూడా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అకీర నందన్ :
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్ కూడా సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.

భార్గవ్ రామ్, అభయ్ రామ్ :
జూనియర్ ఎన్టీఆర్ ఇద్ద‌రు కుమారులు నటవారసులుగా ఎంట్రీ ఇవబోతునారు. ఇప్పటికే అభయ్ రామ్ మహేష్ బాబు రాజమౌళి సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడ‌ని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సితార, అభయ్ రామ్ అక్క, తమ్ముళ్లుగా నటిస్తున్నారని తెలుస్తుంది.