ప్రతి ఒక్కరికి తన జీవితంలో ఎంతోమంది నచ్చుతారు..అలా కొందరి పరిచయం స్నేహంగా ఉంటే.. మరికొందరిది ప్రేమగా మారుతుంది. అయితే మన జీవితంలో ఎంతమందిని ప్రేమించిన మొదటి ప్రేమను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేము.. ఆ ప్రేమ అనేది ప్రతి ఒక్కరికి టీనేజ్ లోనే కలుగుతుంది.. అది మనం చనిపోయేదాకా అసలు మర్చిపోలేం.
ఎందుకంటే ఆ వయసులో మనం మన మనసులో ఎలాంటి స్వార్థం, చెడు ఆలోచనలు వంటివి మన దగ్గర ఉండవు..మనం మనసుకు నచ్చిన వారిని ప్రేమించుకోవడం అనేది ఆ వయసులో జరుగుతుంది. అలాంటి ఈ ఇష్టాన్ని చిత్ర పరిశ్రమలో ఉండే మన స్టార్ స్టార్ హీరోయిన్లు కూడా వారీ టీనేజ్లో ఎవర్ని ప్రేమించి.. ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు ఒకసారి తెలుసుకుందాం.
శృతిహాసన్: లోకనాయకుడు కమలహాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇక శృతిహాసన్ 15 ఏళ్ల వయసులోనే ఓ అబ్బాయిని ఎంతగానో ప్రేమించి ఇష్టపడిందట. ఈ విషయం శృతిహాసన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఆ తర్వాత ఈమె ఏ ఏ హీరోతో లవ్ లో ఉందో అందరికీి తెలిసింది.
కియరా అద్వానీ: బాలీవుడ్ అందాల ముద్దుగుమ్మ కియరా అద్వానీ కూడా టీనేజ్ లోనే ఓ అబ్బాయిని ఎంతగానో ప్రేమించిందట.. ఇంటర్ చదువుతున్న సమయంలో తన క్లాస్మేట్ ని ప్రేమించిందట. ఈ విషయం తెలిసి ఇంట్లో వాళ్ళు ఆమెను వేరే కాలేజ్ కు మారిపించేసారట.. అయినా కూడా ఆమె తన ఇంట్లో వాళ్లకు చెప్పకుండా అబ్బాయిని కలుసుకునేదట. ఇక చిత్ర పరిశ్రమలకి వచ్చాక బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రాను పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
సమంత: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత కూడా చదువుకునే రోజుల్లో ఓ అబ్బాయిని ఎంతో గాఢంగా ప్రేమించిందట. అయితే తన ప్రేమను ఆ అబ్బాయికి చెప్పే ధైర్యం లేక మనసులోనే దాచుకుందట. ఇదే విషయాన్ని సమంత పలు ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇలా ఈ స్టార్ హీరోయిన్లే కాకుండా నిధి అగర్వాల్, తాప్సి కూడా వారీ టీనేజ్ లోనే ప్రేమలో పడ్డారట. ఏది ఏమైనా టీనేజీ ప్రేమ అనేది ఇష్టం లేని వారంటూ ఎవరు ఉండరు. టీనేజీలో సరదాగా ప్రేమించుకోవచ్చు గాని.. పెద్ద పెద్ద నిర్ణయాలు ఎవరు ఎప్పుడు తీసేసుకోకూడదు. ఎందుకంటే అది బాధ్యత తెలియ్యని వయసు కాబట్టి.