క్యూట్‌గా ముద్దొస్తున్న ఈ పాప జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోయిన్‌… తల్లి కూడా స్టార్ హీరోయినే.. గుర్తు పట్టారా..!

చిత్ర పరిశ్రమకు ఇంట్లో వారి పేర్లు చెప్పుకొని ఎంతోమంది స్టార్ హీరోలు అడుగుపెట్టి ఇప్పుడు పాన్‌ ఇండియా హీరోలుగా, గ్లోబల్ హీరోలుగా దూసుకుపోతున్నారు. అదే సమయంలో చిత్ర పరిశ్రమలో అలనాటి స్టార్ హీరోయిన్ల కూతుర్లు మాత్రం హీరోయిన్లుగా చాలా తక్కువ మంది ఎంట్రీ ఇచ్చారు. అలా వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు తొలి సినిమాతోనే చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు.

ఈ విధంగానే తన అంద చందాలతో చిత్ర పరిశ్రమను ఏలేసిన ఓ స్టార్ హీరోయిన్ కూతురు చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టి డిజాస్టర్ హీరోయిన్‌గా మారింది. ఆ డిజాస్టర్ ముద్దుగుమ్మనే పై ఫోటోలో మీరు చూస్తున్న పాప.. ఎంతో క్యూట్గా అందంగా ఉన్న ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పై ఫోటోలో ఉన్న పాపని ఇప్పటికైనా మీరు గుర్తుపట్టారా..? ఆ పాప మరెవరో కాదు ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రాధా కూతురు కార్తీక. నాగచైతన్య హీరోగా వచ్చిన తొలి సినిమా జోష్ సినిమాతో కార్తీక టాలీవుడ్ లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమానే ఈమెకు భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఒక్కటంటే ఒక్క హిట్ అందుకోలేకపోతున్న ఈ బ్యూటీ కి కోలీవుడ్ లో రంగం అనే సినిమాతో మంచి విజయం వచ్చింది.

జీవా హీరోగా వ‌చ్చిన ఈ సినిమా సూప‌ర్ హిట్‌. తెలుగులోనూ రంగం బాగా ఆడింది. ఆ తర్వాత కూడా ఈ అమ్మడుకు మంచి అవకాశాలు రాలేదు. రాధ ప‌ట్టుబ‌ట్టి జూనియ‌ర్ ఎన్టీఆర్ ద‌మ్ము సినిమాలో ఛాన్స్ ఇప్పించింది. అయినా కూడా ఆ సినిమా ఆడ‌క‌పోవ‌డంతో కార్తీక త్వ‌ర‌గానే ఫేడ‌వుట్ అయిపోయింది.

చిత్ర పరిశ్రమ కలిసి రాకపోవడంతో వ్యాపారంగంలో అడుగుపెట్టి.. ప్ర‌స్తుతం సినిమాలకు దూరంగాంగా ఉంటుంది. వ్యాపార రంగంలో మాత్రం ఈ ముద్దుగుమ్మ బానే సక్సెస్ అయింది. రీసెంట్‌గా ఈమె పుట్టినరోజు కావటంతో కార్తీక తల్లి రాధా ఆమె చిన్నప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది ప్రస్తుతం ఆ ఫోటోలే వైరల్ గా మారాయి.