సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు ప్రేమలో పడి వివాహాలు చేసుకున్నారు. కొంతమంది రీల్ లైఫ్ లో ప్రేమించుకుంటున్నట్లు నటిస్తూనే రియల్ లైఫ్ లో ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకున్నారు. మరి కొంతమంది స్టార్స్ ఇండస్ట్రీకి సంబంధం లేని వారిని కుడా ప్రేమించి వివాహం చేసుకున్నారు. అలా ఒకరినొకరు ప్రేమించుకుని కులాంతర వివాహాలు చేసుకున్న స్టార్ నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం.
రామ్ చరణ్ – ఉపాసన :
పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ – ఉపాసన ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఉపాసనకు సినీరంగంతో సంబంధం లేదు. వీరిద్దరిది కులాంతర వివాహం.
మహేష్ బాబు – నమ్రత :
‘ వంశీ ‘ సినిమాలో ఇద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ టైంలో ఒకరినొకరు ప్రేమించుకుని కొంతకాలానికి వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. ఈ ఇద్దరు కులాలు కూడా వేరు.
పవన్ కళ్యాణ్ – రేణు దేశాయ్ :
‘ బద్రి ‘ సినిమా షూటింగ్ టైంలో కలిసి నటించిన ఈ జంట ఒకరినొకరు ప్రేమించి వివాహం చేసుకున్నారు. తర్వాత ఏవో కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. వీళ్ళిద్దరిది కూడా కులాంతర వివాహమే.
అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్- స్నేహ రెడ్డి ఒకరినొకరు ప్రేమించే వివాహం చేసుకున్నారు. స్నేహ రెడ్డికి సినిమా రంగంతో సంబంధం లేదు వీరిద్దరి క్యాస్ట్ కూడా వేరు.
పవన్ కళ్యాణ్ – అన్నా లెజ్ నోవా :
పవన్ కళ్యాణ్ – అన్న తీన్మార్ సినిమాలో కలిసి నటించారు. వీరిద్దరి కూడా ప్రేమ వివాహం. వీరిద్దరూ కులాంతరమే కాదు మతాంతర వివాహం చేసుకున్నారు.
సమంత – నాగచైతన్య :
‘ ఏం మాయ చేసావే ‘ సినిమా ద్వారా ఆన్ స్క్రీన్ పై రొమాన్స్ చేసిన ఈ జంట ఆఫ్ స్క్రీన్ పై కూడా రొమాన్స్ కంటిన్యూ చేశారు. ఇద్దరు ఒకరినొకరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ కొంతకాలానికే వీరిద్దరు మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకున్నారు. వీరిద్దరిది కూడా కులాంతర, మతాంతర వివాహం.
వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి :
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి ఒకరినొకరు వివాహం చేసుకోబోతున్నారు. వీరిద్దరిదీ కూడా కులాంతర వివాహమే.
అలా నాగార్జున – అమల, శ్రీకాంత్ – ఊహ, సుమంత్ – కీర్తి రెడ్డి, వెంకటేష్ – నీరజారెడ్డి, రానా దగ్గుపాటి – మెహిక బజాజ్, సూపర్ స్టార్ కృష్ణ – విజయనిర్మల, కమల్ హాసన్ – సారిక, సూర్య – జ్యోతిక, అజిత్ – షాలిని, యష్ – రాధిక పండిత్, అంబరీష్ – సుమలత, సావిత్రి – జెమినీ గణేషన్, రోజా – సెల్వమణి, రమ్యకృష్ణ – కృష్ణవంశీ, విగ్నేష్ శివన్ – నయనతార, సల్వా రాఘవన్ – సోనియా అగర్వాల్, శ్రీదేవి – బోని కపూర్, జయసుధ – నితిన్ కపూర్, జయప్రద – శ్రీకాంత్ నహత ఇలా ఎంతోమంది ఒకరినొకరు ప్రేమించుకుని కులాంతర వివాహాలు చేసుకున్నారు.