గతంలో టాలీవుడ్‌ను ఒక ఊపు ఊపేసిన మాజీ లవర్ బాయ్ తరుణ్ నాలుగు పదుల వయసు వచ్చిన కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఇక తరుణ్ పెళ్లెప్పుడు చూసుకుంటాడు అంటూ ఆయన అభిమానులు గత పది సంవత్సరాలుగా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. కానీ ఆ సమయం మాత్రం తరుణ్ జీవితంలో రావడం లేదు. ఇక మరోవైపు ఆయన పెళ్లి పై తరచు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.ఇక ఇప్పుడూ గత రెండు రెండు రోజుల నుంచి తరుణ్ పెళ్లికి సంబంధించిన వార్త టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లోను సోషల్ మీడియాలోనూ ఎంతో వైరల్ గా మారింది.
ఈ మాజీ లవర్ బాయ్ త్వరలోనే మెగా ఇంటికి అల్లుడుగా వెలబోతున్నాడని.. రీసెంట్ గానే మెగా డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్యతో విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ మెగా డాటర్ నిహారికను తరుణ్ పెళ్లి చేసుకోబోతున్నాడు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది.అయితే తాజాగా ఈ విషయంపై తరుణ్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు. ఇక గత రెండు రోజులగా సోషల్ మీడియాలో తన పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదాని తేల్చి చెప్పేశాడు.
నిజంగా తన జీవితంలో ఏదైనా గుడ్ న్యూస్ ఉంటే నేనే స్వయంగా ముందుగా మీతో పంచుకుంటానని.. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలు, రూమర్లను సృష్టించవద్దని తరుణ్ విజ్ఞప్తి చేశాడు. ఇక దీంతో నిహారిక- తరుణ్ పెళ్లి అని వచ్చిన వార్త ఫేక్ న్యూస్ అని తేలిపోయింది. తరుణ్ చైల్డ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ అంతే త్వరగా ఫీడ్ అవుట్ హీరోల లిస్టులో చేరాడు. ప్రస్తుతం తరుణ్ సినిమాలకు దూరంగా ఉంటూ వ్యాపార రంగంలో దూసుకుపోతున్నాడు.