హీరో హర్షవర్ధన్ అంటే త్వరగా గుర్తుకు రాదు కానీ… అవును, అవును 2 సినిమాల్లో హీరో అంటే ఠక్కన గుర్తుకొస్తుంది. ఈ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హర్షవర్ధన్ తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా అంతగా క్రేజ్ రాలేదు. రాజమండ్రిలో పుట్టి పెరిగిన హర్షవర్ధన్ తెలుగువారికి టాలీవుడ్ లో అవకాశాలు తక్కువగా ఉంటాయని ముందుగానే గ్రహించి ముంబై వెళ్ళిపోయాడు.
అక్కడ బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. హర్షవర్ధన్ పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం హిందీలో ఐదు సినిమాల్లో నటిస్తున్న హర్షవర్ధన్ సినిమాల్లో కంటే ఎప్పుడు ?ఎఫై.. న్యూస్‌లతోనే ఎక్కువగా పాపులర్ అవుతున్నాడు. మొదట్లో పెళై విడాకులు తీసుకున్న నటి కిమ్ శర్మతో డేటింగ్ చేశాడు. కొన్నాళ్లపాటు వీరు ఫుల్‌గా ఎంజాయ్ చేశాక బ్రేకప్ అయ్యింది.
తర్వాత కిమ్ శర్మ లియండర్ పేస్‌తో సెటిల్ అయిపోయింది. హర్షవర్ధన్ మాత్రం కొంతకాలం ఖాళీగా ఉండి తర్వాత మీనాక్షి దాస్‌తో ప్రేమలో పడ్డాడు. వీరిద్దరు కూడా విడిపోవడంతో ముచ్చటగా మూడోసారి తనతో పాటు నటించిన సంజీదా షేక్ తో ప్రేమాయణం నడుపుతున్నట్టు బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. సంజీదాకు ఇదివరకే పెళై ఒక పాప కూడా ఉంది. అమీర్ అలీ అనే నటుడిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకి జన్మనిచ్చింది.
తర్వాత సంజీదా 2 ఏళ్ళ క్రితం అతనికి విడాకులు ఇచ్చింది. ఇప్పుడు హర్షవర్ధన్ – సంజీదా కలిసి షికార్లు చేస్తున్న ఫోటోలు మీడియాకు చికాయి. కొనెల క్రితం హర్షవర్ధన్ తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేశాడు. ఒకే లోకేషన్లో వీరిద్దరు ఉన్నట్టు తేలింది. ఆ ఫొటోల్లో సంజీదా కూతురు కూడా ఉండడం విశేషం. దీంతో వీరి మధ్య సంథింగ్ సంథింగ్ నడుస్తుందన్న రూమర్లు అయితే బీ టౌన్‌లో జోరుగా వినిపిస్తున్నాయి.