” బన్నీ ” హీరోయిన్ గౌరీముంజ‌ల్‌కు టాలీవుడ్ డైరెక్ట‌ర్లు అందుకే ఛాన్సులు ఇవ్వ‌లేదా ?

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ బన్నీ ‘ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైంది గౌరీ ముంజ‌ల్. 2005లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. వివి. వినాయ‌క్ ఈ సినిమాకు ద‌ర్శ‌కుడు.
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న గౌరీ ఆ తర్వాత మాత్రం ఇండస్ట్రీకి కొంతకాలం దూరంగా ఉంది. మళ్లీ కొంతకాలానికి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి శ్రీకృష్ణ ,గోపి, భూకైలాస్, కౌసల్య సుప్రజా రామా, బంగారు బాబు లాంటి సినిమాలలో నటించింది.

ముంజాల్‌కి అందం, అభినయం ఉన్నా ఆమె న‌టించిన‌ సినిమాలు సక్సెస్ కాక ఈమెకు సరైన గుర్తింపు రాలేదు. కన్నడ, మలయాళ భాషల్లోనూ అడపాదడపా సినిమాల్లో నటించిన గౌరీ ముంజాల్ అక్కడ కూడా ఫ్లాప్ హీరోయిన్‌ టాక్ సొంతం చేసుకుంది. దీంతో టోటల్‌గా సినిమా ఇండస్ట్రీకి దూరమైంది గౌరి. ఇప్పటికీ అదే అందంతో ఎంతో యాక్టివ్ గా ఉంటున్న గౌరీ మంజల్ ఇంకా వివాహం చేసుకోలేదు.

అదే హాట్‌ ఫిజిక్ ను మెయింటైన్ చేస్తూ సినిమా అవ‌కాశ‌ల కోసం ఎదురుచూస్తుంది. కానీ గౌరీ ముంజ‌ల్‌ ఫ్లాప్ హీరోయిన్ అనే కారణంగా డైరెక్టర్ అవకాశాలు ఇవ్వ‌డం తగ్గించేసారన్న వార్తలు టాలీవుడ్‌లో అప్ప‌ట్లో వినిపించాయి. సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో గౌరీ ఫ్యామిలీతో కలిసి ఢిల్లీలో ఉంటూనే కొన్ని వ్యాపారాల్లోకి అడుగు పెట్టింది.

ఆ వ్యాపారాలు సూపర్ సక్సెస్ తో రాణించడంతో రెండు చేతుల సంపాదిస్తోంది. ఇక ఒకవేళ సినిమాల్లో అవకాశాలు వస్తే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయడానికి ఈ ముద్దుగుమ్మ సిద్ధంగా ఉందంటూ సమాచారం అందుతుంది. ఇకపై గౌరీ ముంజ‌ల్ సెకండ్ ఇన్సింగ్స్ స్టార్ట్ చేసి సినిమాల్లో నటిస్తుందో లేదో చూడాలి.