టాలీవుడ్ కాస్ట్‌లీ క‌మెడియ‌న్‌గా వెన్నెల కిషోర్‌.. ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ చూస్తే గింగ‌రాలు తిరుగుతాం..!టాలీవుడ్ కాస్ట్‌లీ క‌మెడియ‌న్‌గా వెన్నెల కిషోర్‌.. ఒక్క రోజు రెమ్యున‌రేష‌న్ చూస్తే గింగ‌రాలు తిరుగుతాం..!

అమెరికాలో మాస్టర్స్ చదివి ఉద్యోగం చేస్తూ హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వెన్నెల కిషోర్‌ అకోకుండా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఒక్క‌సారి ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టాడంటే బ‌య‌ట‌కు పోవ‌డం అంత తేలిక కాదు. వెన్నెల కిషోర్ జీవితంలోనూ అదే జ‌రిగింది. వెన్నెల సినిమాతో సిని రంగ‌ ప్రవేశం చేసి… తొలి సినిమానే తన ఇంటిపేరుగా మార్చుకున్న వెన్నెల కిషోర్ కు సినీ అవకాశాలు లైన్ కట్టాయి. దీంతో ఉద్యోగాన్ని వదిలేసుకుని సినీ ఇండస్ట్రీలో సెటిలైపోయాడు.

చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు. ఎలాంటి పాత్రల‌లో అయినా జీవిస్తూ…త‌న‌ను మించిన కమెడియన్ ఇంకొకరు లేరని నిరూపించుకున్నాడు. ప్రస్తుతం బ్రహ్మానందం సినీ ఇండస్ట్రీలో పెద్దగా నటించకపోవడంతో వెన్నెల కిషోర్ కి కమెడియన్ పాత్రలు బాగా పెరిగాయి. ఇటు యంగ్ హీరోల‌తో పాటు స్టార్ హీరోల సినిమాల్లో న‌టిస్తూ టాలీవుడ్ కాస్ట్‌లీ క‌మెడియ‌న్‌గా వెన్నెల కిషోర్‌.

ఎప్పటికప్పుడు స్టార్ కమెడియన్ గా దూసుకుపోతూ తన సత్తా చాటుతున్నాడు. గ‌త ఏడాది మాత్ర‌మే ఏకంగా 25కు పైగా సినిమాల్లో న‌టించాడంటేనే మ‌నోడి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో తెలుస్తోంది. ప్ర‌స్తుతం భోళాశంకర్, హ‌నుమాన్‌, బెదురులంక 2012, గుంటూరు కారంతో పాటు అనేక చిత్రాల్లో భాగ‌మ‌య్యాడు. ఇదిలా ఉంటే తన క్రేజ్‌కు తగ్గట్టుగా రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గడం లేదు.

టాలీవుడ్ కూడా ఈ విషయం గురించి కోడై కూస్తొంది. చిన్న లేదా పెద్ద సినిమా అయినా కూడా మ‌నోడి రెమ్యునరేషన్ మాత్రం ఒకటే. వెన్నెల కిషోర్‌ ఒక్క రోజు కాల్ షీట్ ఇచ్చాడంటే దాదాపు రూ. 8 ల‌క్ష‌లు ఛార్జ్ చేస్తున్నాడంట. ప‌ది రోజులు షూటింగ్‌లో పాల్గొంటే రూ. 80 ల‌క్ష‌లు అకౌంట్ లో ప‌డాల్సిందే అని అంటున్నారు. ఒక‌వేళ ప్ర‌మోష‌న్స్ లో పాల్గొనాలి అంటే మ‌ళ్లీ అందుకు వేరే రెమ్యున‌రేష‌న్ తీసుకుంటాడ‌ట‌.