టాలీవుడ్‌లో ఏకంగా ఇంత‌మంది సెల‌బ్రిటీలు విడాకులు తీసుకున్నారా…!

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో, హీరోయిన్స్ ఒకరినొకరు ప్రేమించుకోవడం వారిద్దరి మధ్య ప్రేమ బలపడిన కొంతకాలానికి వివాహం చేసుకోవడం.. వివాహమైన కొంతకాలానికే విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. తాజాగా నిహారిక – జొన్నలగడ్డ చైతన్య విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట కంటే ఇండ‌స్ట్రీలో విడాకులు తీసుకున్న జంట‌ల లిస్ట్ చూద్దాం.

నిహారిక – చైతన్య :
మెగా డాటర్ నిహారిక – జొన్నల గడ్డ చైతన్య 2020లో రాజస్థాన్ కోటలో అట్ట‌హాసంగా వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఈ జంట విడాకులు తీసుకొని వారి వివాహ బంధానికి కి గుడ్ బై చెప్పారు.

రాఖీసావంత్ – రితేష్ :
బాలీవుడ్ యాక్టర్స్ రాఖీసావంత్ సినిమాల కంటే కాంట్రవర్సీలో ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకున్న ఈమె భర్తతో తన ఏడేళ్ల బంధానికి స్వస్తి చెప్పింది. రాఖీసావంత్ భర్త ఎన్నారై. గత ఏడాది హిందీ బిగ్‌బాస్ 15 రియాల్టీ షో స్టేజ్ పై తన భర్తను ప్రేక్షకులకు పరిచయం చేసిన రాఖీ అదే ఏడాది భర్తకు విడాకులు ఇచ్చేసింది.

నాగచైతన్య – సమంత :
తెలుగు ఇండస్ట్రీలో క్యూట్ పెయిర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సమంత – నాగచైతన్య పెళ్లయిన మూడు సంవత్సరాలకే విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నారు.

ధనుష్ – ఐశ్వర్య :
ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య 2004లో వివాహం చేసుకున్నారు తమ‌ 18 ఏళ్ల వివాహ జీవితానికి స్వస్తి చెప్తూ ఐశ్వర్యతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు ధ‌నుష్.

నాగార్జున – లక్ష్మి :
టాలీవుడ్ కింగ్ నాగార్జున – నిర్మాత ద‌గ్గుబాటి రామానాయుడు కుమార్తె శ్రీ లక్ష్మి ఇద్దరు వివాహం చేసుకొని నాగచైతన్యకు జన్మనిచ్చిన తరువాత మనస్పర్ద‌ల‌ కారణంగా విడాకులు తీసుకున్నారు.

సుమంత్ – కీర్తి రెడ్డి :
పవన్ కళ్యాణ్ తో పాటు తొలిప్రేమ సినిమాలో నటించిన కీర్తి రెడ్డి – సుమంత్ వివాహం చేసుకున్నారు. ఈ వివాహ బంధం ఎంతో కాలం నిలవలేదు పెళ్లయిన కొంతకాలానికే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. తర్వాత సుమంత్ మరో వివాహం చేసుకోలేదు.

పవన్ కళ్యాణ్ – నందిని :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదట నందిని అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. 1997లో వివాహమైన ఈ జంట 2008లో విడిపోయారు. తర్వాత 2008లో రేణు దేశాయ్‌ని వివాహం చేసుకున్న పవన్ కళ్యాణ్ ఆమెకు కూడా కొంతకాలానికే విడాకులు ఇచ్చి రష్యన్ అమ్మాయి అన్నా లెజ్‌నోవాను మూడో వివాహం చేసుకున్నాడు.

విజయదుర్గ :
మెగా హీరో సాయి దుర్గ తల్లి విజయ దుర్గ కూడా మొదటి భర్త విడాకులు తీసుకున్న చాలా కాలానికి రెండో వివాహం చేసుకుంది. ఆమె ఇద్ద‌రు కొడుకులు వైష్ణ‌వ్‌తేజ్‌, సాయిధరమ్ తేజ దగ్గరుండి ఈ వివాహం జరిపించారు.

సింగర్ సునీత :
సునీత కూడా తన మొదటి బర్త‌కు విడాకులు ఇచ్చి చాలా ఏళ్ల తర్వాత రామ్ వీరపనేని వివాహం చేసుకుంది. గతేడాది వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. వీరి పెళ్లి అప్పట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అయింది.

డైరెక్టర్ క్రిష్ :
డైరెక్టర్ క్రిష్ కూడా పెళ్లయి రెండేళ్లయినా కాకముందే భాగస్వామికి విడాకులు ఇచ్చేసాడు. ఓ స్టార్ హీరోయిన్ తో ఎఫైర్ లో ఉన్నాడని.. అందుకే క్రిష్ మొదటి భార్య రమ్యకు విడాకులు ఇచ్చాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఇలానే కమల్ హాసన్ – సారిక, కమలహాసన్ – వాణి గణపతి, నరేష్ – ర‌మ్య‌, అమలాపాల్ – ఏఎల్ విజయ్, అరవింద్ స్వామి – గాయత్రి, బాలీవుడ్ యాక్టర్స్ దియామీర్జా, సీనియర్ యాక్ట్రెస్ లక్ష్మీ, సీనియర్ హీరోయిన్ కళ్యాణి – సూర్యకిరణ్, సీనియర్ ఆర్టిస్ట్ ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ – ప్రణతి, సామ్రాట్ రెడ్డి, శరత్ బాబు – రమాప్రభ, భాగ్యశ్రీ, రాధిక – శరత్ కుమార్, సంపత్ రాజ్ – శరణ్య, సెల్వ రాఘవన్ – సోనియా అగర్వాల్, వనిత విజయ్ కుమార్, చలం – శారద, అమీర్ ఖాన్ – రీనా, అమీర్ ఖాన్ – కిరణ్ రావు, హృతిక్ రోషన్ – సుశానే ఖాన్ ఇలా చాలామంది స్టార్ యాక్టర్స్ వారి జీవిత భాగస్వామితో విడాకులు తీసుకున్నారు.