రెండో పెళ్లి చేసుకున్నా..మొదటి భార్య ఫ్యామిలీని వ‌ద‌ల‌ని సెల‌బ్రిటీలు వీళ్లే…!

ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లి చాలా కామన్. పెళ్లి జరిగినా సినిమాల్లో నటించే సమయంలో మరొకరితో ప్రేమలో పడతారు సినీ సెల‌బ్రిటీలు. మొదటి పెళ్లి రద్దు చేసుకుని రెండో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మొద‌టి భార్య ఉండ‌గానే రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్య పిల్లల్ని ప్రేమగా చూసుకుని సెలబ్రిటీస్ కూడా ఉన్నారు.

అక్కినేని అమల :
అక్కినేని నాగార్జున అమ‌ల‌ను రెండో పెళ్లి చేసుకున్నా మొదటి భార్య కుమారుడు నాగచైతన్యని అమల కుమారుడు అఖిల్ తో సమానంగా చూసుకున్నాడు.

గౌతమి :
కమల్ హాసన్ తో బంధం కొన‌సాగిస్తున్న టైంలో కమల్ హాసన్ రెండో భార్య సారిక‌ పిల్లలైన శృతి, అక్షర‌ను త‌న సొంత కూతుళ్లుగా చూసుకుంది గౌతమి. ఇక క‌మ‌ల్ కూడా త‌న ఇద్ద‌రు కూతుళ్లు శృతి, అక్ష‌ర‌కు ఎంతో ప్ర‌యార్టీ ఇస్తాడు.

నిర్మలాదేవి :
మంచు మోహన్ బాబు మొదటి భార్య చనిపోయిన తరువాత ఆమె చెల్లెలైన నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. మొదటి భార్య పిల్లలైనా విష్ణు, లక్ష్మి నిర్మల‌ అక్క పిల్లలు అయినా తన సొంత కూతురు, కొడుకులా చూసుకుంటుంది.

నందమూరి హరికృష్ణ :
నంద‌మూరి హరికృష్ణ ఇద్దరి భార్యలను వివాహం చేసుకున్నారు. తన మొదటి భార్య పిల్లలు కళ్యాణ్ రామ్, జానకిరామ్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో భార్యకి ఒక కుమారుడే ఎన్టీఆర్‌. కళ్యాణ్ రామ్, జానకిరామ్, ఎన్టీఆర్ వీరు ముగ్గురు కలిసిమెలిసి ఉంటారు.

రాధిక :
కోలీవుడ్ సీనియ‌ర్ హీరో శరత్ కుమార్ మొదటి భార్య కూతురు అయినా వరలక్ష్మి శరత్ కుమార్ ను తన సొంత కూతురుగా చూసుకుంటుంది రాధిక‌. ఇక రాధిక‌కు శ‌ర‌త్‌కుమార్ మూడో భ‌ర్త కాగా… శ‌ర‌త్‌కు రాధిక రెండో భార్య‌.