ప్రముఖ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించి ఎంతోమంది అభిమానుల మనసు గెలుచుకుంది. ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గుతున్నాయనే సమయంలో రష్యాకు చెందిన ఆండ్రూని వివాహం చేసుకుంది. తన పెళ్లి విషయం ఎవరికీ చెప్పలేదు. అలానే తను తల్లి అయిన విషయం కూడా రహస్యంగానే ఉంచింది శ్రియ.
సడన్గా ఒక రోజు సోషల్ మీడియాలో తనకు కూతురు ఉందని చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. పెళ్లియి, తల్లయితే అవకాశాలు రావేమో అని ఆమె వీటిని సీక్రెట్ గా ఉంచి ఉండొచ్చని అభిమానులు అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటకు చెప్పకుండా దాచినందుకు చాలా విమర్శలను ఎదుర్కొంది. అయితే ఆ విమర్శలకు గట్టిగానే సమాధానం చెప్పింది ఈ అమ్మడు.
“గర్భం దాల్చిన తర్వాత శరీరంలో అనేక మార్పులు రావటం అనేది సహజం. కానీ సెలబ్రిటీల విషయంలో మాత్రం దానిని ఒక వింతగా చూసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తూ ఉంటారు. అందుకే నేను భయపడి నా ప్రెగ్నెన్సీ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. నా బిడ్డ కడుపులో ఉన్నప్పుడు నేను చాలా ప్రశాంతంగా ఉండాలి అని అనుకున్నాను” అంటూ సమాధానం చెప్పింది.
ఇటీవల శ్రియ తన కూతుర్ని స్కూల్లో చేర్పించిన విషయం అభిమానులతో షేర్ చేసుకుంది. పిల్లల్ని మొదటిసారి స్కూల్ కి పంపడం అనేది ఒక ఎమోషనల్ మూమెంట్. ఆ ఎమోషనల్ మూమెంట్ ని శ్రియ కూడా అనుభవిస్తుంది. మొదటి రోజు శ్రియ తన భర్తతో కలిసి తన కుమార్తె రాధను స్కూల్లో జాయిన్ చేసింది.
స్కూల్ అయిపోయిన తర్వాత రాధ అక్కడే ఉన్న ప్లే జోన్లో ఆడుకుంటూ ఇంటికి రానని మారం చేస్తుందట. శ్రియ తన కూతురితో ఇంటికి వెళదామని ఎంత బతిలాడినా రాలేదట. శ్రియ తన కూతుర్ని ఇంటికి రమ్మని బతిమిలాడే వీడియో, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కూతురుతో ఫస్ట్ డే స్కూల్ ఎక్స్పీరియన్స్ని శ్రియ అభిమానులకు షేర్ చేసింది.