పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ మర్చిపోలేని క్లాసిక్ సినిమా తొలిప్రేమ. ఇప్పుడు 25 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ సినిమా ఇప్పటికీ ఓ సంచలనం. నిజంగా తొలిప్రేమ సినిమా చూస్తుంటే ఇప్పటికీ చాలా కొత్త ఫీలింగ్ కలుగుతుంది. మనసుకు హత్తుకునేలా అంత గొప్పగా ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కరుణాకరన్.
పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే సూపర్ బ్లాక్ బస్టర్ సినిమాలలో ఒకటిగా నిలిచిన తొలిప్రేమ ఆ రోజుల్లో ఒకే థియేటర్లో 250 రోజులు ఆడి సరికొత్త సంచలనం క్రియేట్ చేసింది. విచిత్రం ఏంటంటే ఈ సినిమా నైజాం డిస్ట్రిబ్యూటర్ నైజాం మొత్తం మీద కొన్న అమౌంట్ హైదరాబాదులో ఒక్క థియేటర్లోనే వచ్చేసింది. అంత గొప్ప బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టింది తొలిప్రేమ.
ఈ సినిమా రిలీజ్ అయ్యి 25 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈనెల 30న పలు ప్రాంతాల్లో చేస్తున్నారు. ఇప్పటికే రీ రిలీజ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ఇక రీ రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ సూపర్ స్పీడ్ గా షురూ అయ్యాయి. రీ రిలీజ్ బుకింగ్స్‌లో కూడా చాలా ప్రాంతాల్లో ఈ సినిమా టిక్కెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.
రిలీజ్‌కు మరో రెండు రోజుల టైం ఉన్నా కూడా ఇప్పటికే చాలా ఏరియాల్లో టిక్కెట్లు అన్నీ హౌస్ ఫుల్స్ పడ్డాయి. రీ రిలీజ్ అయ్యే ఏ థియేటర్లో చూసినా ఒక్క టిక్కెట్ కూడా దొరికే పరిస్థితి లేదు. దీంతో పవన్ స్టామినా, క్రేజ్ ఏ రేంజ్లో ఉన్నాయో తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్‌కు జోడీగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించగా, అలీ, వేణు మాధవ్, రవి బాబు కీలక పాత్రల్లో నటించారు. కరుణాకరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రీ రిలీజ్ కోసం ఖచ్చితంగా సంచలనం నమోదు చేసేలా ఉంది. ఈ సినిమా రీ రిలీజ్లో సరికొత్త ట్రెండ్‌తో పాటు భారీ వసూళ్లను నమోదు చేసేలా ఉంది.