పవన్ కళ్యాణ్ – శోభన్ బాబు కాంబోలో మిస్సయిన సూప‌ర్ హిట్‌ సినిమా ఇదే..!

ఫ్యామిలీ హీరోగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ దివంగత స్టార్ హీరో శోభన్ బాబు.. సోగ్గాడుగా ఆయనకున్న ఇమేజ్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోగ్గాడు శోభన్ బాబు కెరీర్ లో హీరోగా మాత్రమే సినిమాలు చేసిన‌ ఏకైక నటుడు. సినిమాల నుంచి ఒకసారి బయటికి వచ్చిన తర్వాత మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. ఒకవేళ ఆయన తర్వాత కూడా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి ఉంటే మాత్రం ప్రెసెంట్ టాలీవుడ్ స్టార్ హీరోలో సినిమాల్లో కీలక పాత్రలు పోషించేవారు.

అలా ఆయన చేసి ఉంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- శోభన్ బాబు కాంబోలో ఓ సినిమా వెండితెరపై అలా కనిపించేది. కానీ అది కుదరలేదు. పవన్ కళ్యాణ్, సీనియర్ దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు కాంబోలో వచ్చిన సుస్వాగతం సినిమా పవన్ కెరీర్ లోనే క్లాసికల్ హిట్ సినిమాల్లో ఒకటి. ఈ సినిమాలో దేవ‌యాని హీరోయిన్‌. సూప‌ర్ హిట్ కొట్టిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తండ్రి పాత్రలో రఘువరన్ నటించారు.

అసలు విషయానికి వస్తే నిజానికి ఈ సినిమాలో ఆ పాత్రను ముందుగా శోభన్ బాబుతో చేయించాలని దర్శకుడు భీమినేని భావించారట. ఇదే విషయాన్ని శోభన్ బాబుతో కూడా చెప్పగా ఆయన ఆ పాత్రకు ఒప్పుకోలేదు. తాను హీరో గానే సినిమాలు చేశాను.. చివరి వరకు హీరోగానే ఉంటాను.. సహాయ నటుడుగా చేయనని తెగేసి చెప్పేసాడట. అలా ఆ తర్వాత ఆ పాత్ర రఘువరన్‌కు దక్కగా ఆయన ఆ పాత్రలో జీవించేశారు. ఇలా పవన్ కళ్యాణ్- శోభన్ బాబు కాంబోలో సూపర్ హిట్ సినిమా మిస్ అయింది.