హాట్ యాంకర్ అనసూయకు నాగార్జునకు మధ్య ఉన్న ఆ సీక్రెట్ రిలేషన్ ఇదే…!

బుల్లితెరపై హాట్ యాంకర్ అనసూయ తన యాంకరింగ్ తో ఎందరో అభిమానులను సొంతం చేస్తుంది. ప్రస్తుతం వరుస‌ సినిమాల్లో నటిస్తూ యాంకరింగ్ కి గుడ్ బై చెప్పింది. అనసూయ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఇక ఈమె ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి.. చిన్నతనం నుంచి సినిమాల మీద ఉన్న ఆసక్తితో చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టాలని ఉండేది. అనసూయ ఆలోచనలకు పూర్తి విరుద్ధంగా వారి కుటుంబం వ్యవహరించేది.

Soggade Chinni Nayana (2016)

ఎలాగైనా తన కోరిక నెరవేర్చుకోవాలని.. వెండితెరపై తనని తాను చూసుకోవాలనే ఆశ అనసూయకు ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో ఎన్టీఆర్ హీరోగా వచ్చిన నాగ సినిమాలో ఓ చిన్న పాత్రలో మెరిసింది అనసూయ. అయితే ఈ పాత్రకి అంతగా గుర్తింపు లేకపోయినా ఆమె స్నేహితులు ప్రోత్సహించడంతో సినిమా ట్రైల్స్ చేస్తూనే ఉంది. ఆ సమయంలో అనసూయ సినిమాల్లోకి వెళ్ళటం వారి కుటుంబానికి అసలు ఇష్టం లేదు.

అనసూయ బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ నుంచి వచ్చింది.. బ్రాహ్మణ కుటుంబం అంటే ఎలాంటి క‌ట్లుబాట్లు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ తన కుటుంబాన్ని ఎదిరించి భర్త సహాయంతో అనసూయ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది. అలా యాంకర్ గా, హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పుష్ప వంటి పాన్ ఇండియా సినిమాలో విల‌న్ గా చేసే రేంజ్‌కు ఆమె ఎదిగింది.

Soggade Chinni Nayana (2016)

అనసూయకి సినిమాల్లో అవకాశాలు వచ్చింది మాత్రం ఓ స్టార్ హీరో వల్లే అన్న విష‌యం చాలా త‌క్కువ మందికి మాత్ర‌మే తెలుసు. అనసూయకు ఇన్ని అవకాశాలు రావడానికి ముఖ్య కారణం టాలీవుడ్ సీనియర్ హీరో నాగార్జున ఆట. ఓ రోజు అనసూయ ఓ డైరెక్టర్ తో క‌లిసి నాగార్జున దగ్గరికి సినిమా ఛాన్స్ కోసం వచ్చిందట. అప్పుడే నాగార్జున నటిస్తున్న సోగ్గాడే చిన్నినాయన సిమాలో కీలక పాత్రలో నటించే అవకాశం అనసూయకి ఇచ్చారట.

ఆ పాత్రకి అనసూయకి మంచి గుర్తింపు వచ్చింది.. ఆ తర్వాత క్షణం, రంగస్థలం లాంటి పలు సినిమాల్లో న‌టించ‌డంతో ఆమె ఇక వెన‌క్కు తిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. ఆ త‌ర్వాత నాగార్జున‌కు అన‌సూయ క్లోజ్ కావ‌డంతో పాటు వారిద్ద‌రి మ‌ధ్య మంచి స్నేహ సాన్నిహిత్యం కూడా ఏర్ప‌డింది.