ఏదైనా సినిమా విడుదలవుతుందంటే సినిమా టిక్కెట్లు ఆన్‌లైన్ లేదా థియేటర్ వద్ద ఉన్న కౌంటర్లో తీసుకుంటాం.. కానీ ఈ రెండు పద్ధతుల్లో కాకుండా మొట్టమొదటిసారిగా థియేటర్ లోపల కూర్చోబెట్టి టికెట్లు ఇచ్చిన సినిమా బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు. ఈ సినిమా అప్పట్లో ఓ సంచలన విజయం సాధించింది.
ఎంతలా అంటే ఈ సినిమా విడుదల అయితే థియేటర్ ముందు ఉన్న అభిమానులను తట్టుకోలేక థియేటర్ లోపల కూర్చోబెట్టి టిక్కెట్లు ఇచ్చే అంతల ఈ సినిమా ఆ రోజుల్లో పెను ప్రభంజనం సృష్టించింది. బి గోపాల్ దర్శకత్వంలో వచ్చిన నరసింహనాయుడు సినిమా 2001 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు, విక్టరీ వెంకటేష్ నటించిన దేవి పుత్రుడు సినిమాలు కూడా ఆ సంక్రాంతికి ప్రేక్షకులు ముందుకు వచ్చాయి.
ఆ రెండు సినిమాలను కూడా పక్కకు నెట్టి నరసింహనాయుడు సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.ఈ సినిమా ఏకంగా 105 సెంటర్లో వంద రోజులు ఆడి బాలకృష్ణ కెరీర్ లోనే మెమొరబుల్ సినిమాగా మిగిలిపోయింది. ఈ సినిమా తర్వాత దాదాపు 5 సంవత్సరాలు పాటు టాలీవుడ్‌లో ఫ్యాక్షన్ సినిమాలే రాజ్యమేలాయి.
ఈ సినిమా ఇంతటి ఘన విజయం సాధించడానికి ముఖ్య కారణం ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన మణిశర్మ ఈ సినిమాకి కథ ఇచ్చిన చిన్ని కృష్ణ, డైలాగ్స్ రాసిన చిన్నకృష్ణ. ఈ సినిమాలో వచ్చే ట్రైన్ ఎపిసోడ్ సినిమాకే ఎంతో హైలెట్‌గా నిలుస్తుంది. ఇక ఇప్పుడు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని కూడా మరోసారి రీరిలీజ్ చేయడానికి బాలయ్య అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.