టీడీపీ యువ నాయకుడు.. నారా లోకేష్ యువగళం పాదయాత్ర అధికార పార్టీ నాయకుల్లో కలకలం రేపు తోందా? ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకున్నట్టు కాకుండా.. యువగళం పాదయాత్ర సంచలనంగా మారిందా? ప్రజలు భారీ ఎత్తున ప్రభంజనంగా తరలి వస్తున్నారా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీల కులు. దీనికి తోడు.. వైసీపీ నాయకులు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మరింత దుమారం రేపుతోందని చెబుతున్నారు.
నెల్లూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగా.. ఇక్కడి వైసీపీ నాయకులపై నారా లోకేష్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వాస్తవాలను ఆధారాలతో సహా తెరమీదికి తెచ్చి మరీ ఆయన ప్రజల ముందు పెట్టారు. కొవ్వూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్‌రెడ్డి నుంచి నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వరకు కూడా.. అనేక మంది వైసీపీ నాయకులపై యువగళం పాదయాత్రలో నారా లోకేష్ విజృంభించారు.
నిజానికి ఎవరు ఎలాంటి విమర్శలు చేసినా.. పెద్దగా లెక్కలోకి తీసుకోని అనిల్‌కుమార్.. నల్లపురెడ్డి ప్రస న్నలు.. నారా లోకేష్ ల ధాటికి.. దూకుడుకు.. ఒకరకంగా.. దిగి వచ్చారనే చెప్పాలి. నల్లపురెడ్డి మీడియా మీటింగు పెట్టి.. తనపై నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకునే పరిస్తితి వచ్చింది. ఇక, అనిల్ కుమార్ ఏకంగా.. దేవాలయంలో ప్రమాణం చేసే పరిస్థితి వచ్చింది.
మరి ఈ పరిస్థితికి వారు వచ్చి.. ప్రమాణాలు వివరణలు ఇచ్చారంటే.. యువగళం ప్రభంజనం ఏంటో వైసీపీ నేతలకు కూడా అర్థమైందని అంటున్నారు పరిశీలకులు. ఆదిలో ఏముందిలే.. అనుకున్నారు. నారా లోకేష్ ను ఎవరు పట్టించుకుంటారని భావించారు. కానీ, అనూహ్యంగా నారా లోకేష్‌కు ప్రజల మద్దతు పెరగడం.. ఆయన విమర్శలు.. వ్యాఖ్యల పదును మరింత పుంజుకున్న నేపథ్యంలో యువగళం దెబ్బకు వైసీపీ నేతలకు తడిసిపోతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.