చిరంజీవి కారణంగా పవన్ కళ్యాణ్‌కు పెద్ద బొక్క పడిన సినిమా ఇదే..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలో మెగా ఫ్యామిలీ లో ఉన్నంతమంది స్టార్ హీరోలు మరో ఏ ఫ్యామిలీలో లేరు ఈ విషయం అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో పది మందికి పైగా స్టార్ హీరోలు ఉంటే అందులో నలుగురు మెగా ఫ్యామిలీకి చెందిన వారే. అంతే కాకుండా మీడియం రేంజ్ హీరోల్లో కూడా ఈ కుటుంబం నుంచే ఎక్కువ మంది హీరోలు ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే టాలీవుడ్ లో సగానికి పైగా మెగా కుటుంబమే ఉంది. ఇక వీరిలో వీరికే పోటీ ఉంటుంది.

Telugu Lyrics: Gudumba Shankar (2004)

 

ఎంత గట్టి పోటీ ఉన్నా కూడా ఒకే సీజన్లో తక్కువ గ్యాప్ లో ఈ కుటుంబం నుంచి సినిమాలు విడుదల కావు. ఒకసారి మాత్రం మెగాస్టార్ చిరంజీవి – పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు స్వ‌ల్ప గ్యాప్‌లో విడుదలయ్యాయి. అందులో చిరంజీవి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా, పవన్ కళ్యాణ్ సినిమా యావరేజ్ గా నిలిచింది. పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ సినిమా అప్పట్లో భారీ అంచనాల మ‌ధ్య‌ సెప్టెంబర్ 10న ప్రేక్షకుల‌ ముందుకు వచ్చింది.

ఈ సినిమా విడుదలకు ముందు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుని అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది. సీరియస్ సినిమా అనుకోని ప్రేక్షకులు సినిమాకి వెళితే కామెడీ సినిమా కావ‌డంతో ప‌వ‌న్ వీరాభిమానులు కూడా కొంత హర్ట్ అయ్యారు. దీంతో ఈ సినిమాకి నెగటివ్ టాక్ వచ్చింది. కానీ కామన్ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా కాస్త న‌చ్చ‌డంతో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర యావ‌రేజ్‌గా నిల‌బ‌డింది.

Shankar Dada MBBS@16Years:16 యేళ్ల చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్‌.. సినిమా  విశేషాలు ఇవే.. | Megastar Chiranjeevi Srikanth Sonali Bendre jayanth c  paranjee shankar dada mbbs completes 16 Years– News18 Telugu

 

ఆ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. గుడుంబా శంకర్‌కు అప్పుడే ఫిక‌ప్ అవుతోన్న టైంలో ఆ సినిమాకు వచ్చే కలెక్షన్స్ మొత్తం చిరంజీవి తన ఖాతాలో వేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ కు పోటీగా చిరంజీవి సినిమా రాకపోయి ఉంటే గుడుంబా శంకర్ కమర్షియల్ గా సూపర్ హిట్ అయ్యేది. ఇలా చిరంజీవి కారణంగా పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద బొక్క పడిందని చెప్పాలి.