పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శుకుడు రాజమౌళి కాంబినేషన్ గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. వీరిద్దరూ కలిసి చేసిన బాహుబలి సినిమా తెలుగు సినిమాని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిందనే చెప్పాలి. వీరిద్దరూ అంతక ముందు ఛత్రపతి సినిమా చేసారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమా టీవీలో వస్తే ఇప్పటికి వదలకుండా చూసే వారు ఉన్నారు. ఆ తరువాత ప్రభాస్, రాజమౌళి కలిసి బాహుబలి సినిమాని తీశారు.
బాహుబలి రెండు పార్టులు తీసి తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమా తరువాత ప్రభాస్, రాజమౌళిల రేంజ్ పాన్ ఇండియా లెవెల్ కి వెళ్ళిపోయింది. బహుబలి కోసం ప్రభాస్, రాజమౌళి 5 ఏళ్ళు కష్టపడ్డారు. అయితే ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్ లో ఛత్రపతి కంటే మరొక సినిమా రావాల్సి ఉంది. అయితే ఆ సినిమా మిస్ అయ్యింది. ఆ సినిమా పేరేంటో తెలుసా..స్టూడెంట్ నెంబర్ వన్.
అవును నిజమే..రాజమౌళి స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాని ముందు ప్రభాస్ తోనే చేయాలనుకున్నారు. ఎన్టిఆర్ కంటే ముందు ప్రభాస్ తో ఈ సినిమా చేయాలనుకున్నారు. చివరికి ఎన్టిఆర్ తో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా చేసారు. రాజమౌళితో ఎన్టిఆర్ కి కూడా ఇదే మొదటి సినిమా. ఈ సినిమా తీసినప్పుడు ప్రభాస్ ఇంకా ఇండస్ట్రీకి పరిచయం కాలేదు. అన్ని అనుకున్నట్టే జరిగి ఉంటె స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తోనే ప్రభాస్ ఇండస్ట్రీలో గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చావాడు.
ఆ తరువాత జక్కన్న ప్రభాస్ తో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు చేసారు. ఎన్టిఆర్ తో యమదొంగ, ఋఋఋ సినిమాలు చేసారు. ఈ సినిమాలతో జక్కన్న మరో స్థాయికి వెళ్లారు. జక్కన్న సినీ కెరీర్ లో అన్ని బ్లాక్ బస్టర్ సినిమాలే ఉన్నాయి. ఇప్పుడు జక్కన్న మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది.