జ‌య‌ల‌లిత కోసం శోభ‌న్ బాబు చేసిన గొప్ప త్యాగం ఇది.. ఎవ్వ‌రికి తెలియ‌ని సీక్రెట్ ..!

తెలుగు సినిమా రంగంలో సోగ్గాడుగా ప్ర‌ఖ్యాతి చెందిన శోభ‌న్‌బాబు జీవితంలో అనేక మ‌లుపులు ఉన్నా యన్న విష‌యం చాలా మందికి తెలియ‌దు. ఆర్థికంగా ఆయ‌న ఎంత బ‌ల‌వంతుడో.. మాన‌సికంగా మాత్రం ఆయ‌న కొన్ని క‌ట్టుబాట్ల‌కు ప‌రిమితం అయ్యారు. స‌మాజం ఏమ‌నుకుంటుందో.. అనే భ‌యం ఆయ‌న‌ను జీవితాంతం వెంటాడింద‌ని ఆయ‌న అనుచ‌రులు, స‌హ‌చ‌రులు కూడా చెప్పేవారు. అన్న‌గారు ఎన్టీఆర్‌తో శోభ‌న్‌బాబుకు చాలా దగ్గ‌ర సంబంధం ఉంది.

Here's the shocking truth behind actor Sobhan Babu and late Tamil Nadu CM  Jayalalitha's affair

ఈ నేప‌థ్యంలో అన్న‌గారితో క‌లిసి అనేక సినిమాల్లో శోభ‌న్‌బాబు న‌టించారు. త‌మ్ముడు అనే చొర‌వ‌తో ఎన్టీఆర్ కూడా.. శోభ‌న్‌బాబుకు ఒక కుటుంబ స‌భ్యుడిగా చేరువ అయ్యారు. ఇదిలావుంటే.. త‌మిళంలోనే కాకుండా.. తెలుగులోనూ.. బ్లాక్ అండ్ వైట్ మూవీల్లో త‌నకంటూ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాయించుకున్న జ‌య‌ల‌లిత శోభ‌న్‌బాబుతో ఏర్ప‌రుచుకున్న సంబంధంపై ఇప్ప‌టికీ అనేక క‌థ‌నాలు వ‌స్తుంటాయి. వీరి బంధానికి గుర్తుగా చిన్నారి ఉంద‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది.

ఇక‌, తెలుగు ఇండ‌స్ట్రీ అంతా కూడా.. హైద‌రాబాద్‌కు వ‌చ్చేయ‌డంలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు, ఎన్టీఆర్ ఎంతో కృషి చేశారు. ఈ స‌మ‌యంలో శోభ‌న్‌బాబుకు స్టూడియో క‌ట్టుకునేందుకు అన్న‌గారు హైద‌రాబాద్ లో స్థ‌లాన్ని చూపించారు. దీనికి ఆయ‌న కూడా ఒప్పుకొన్నారు. అయితే.. త‌మిళ‌నాడును వ‌దిలి వెళ్లొద్ద‌ని.. జ‌య ల‌లిత పెట్టిన ఆంక్ష‌తో శోభ‌న్‌బాబు నిలిచిపోయార‌ని.. అందుకే ఆయ‌నకు హైద‌రాబాద్‌లో ఒక ఇల్లు త‌ప్ప (ఇప్పుడు అది కూడా లేదు) ఏమీ లేద‌ని ప్ర‌చారంలో ఉంది.

Jayalalitha, Shoban Babu Love Scene || Doctor Babu Telugu Movie || Shoban  Babu, Jayalalitha - YouTube

జ‌య‌ల‌లిత కోసం.. శోభ‌న్‌బాబు చేసిన త్యాగాల్లో మ‌రొక‌టి.. కీల‌క‌మైన సినిమాలు వ‌ద‌లుకోవడం. పైకి ఆయ‌న క్ర‌మ‌శిక్ష‌ణ అని పేరు పెట్టుకున్నా.. జ‌య‌ల‌లిత రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత‌.. సినిమాలు వ‌దులుకున్నారు. ఇదే స‌మ‌యంలో ఆమె శోభ‌న్‌బాబుపైనా ఒత్తిడి తెచ్చి.. సినిమాల‌కు దూరం కావాల‌ని కోరడంతో ఆయ‌న కూడా దాదాపు సినిమాలు త‌గ్గించుకుని రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారాల వైపు మొగ్గు చూపించార‌ని అంటారు.