మన తెలుగు చిత్ర పరిశ్రమలో దగ్గుబాటి కుటుంబానికి ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఈ కుటుంబం నుంచి ముందుగా దగ్గుబాటి రామానాయుడు చిత్ర పరిశ్రమలో నిర్మాతగా అడుగుపెట్టి నటరత్న ఎన్టీఆర్‌తో రాముడు భీముడు సినిమా తెరకెక్కించాడు. తొలి సినిమాతోనే భారీ విజయనందుకున్నాడు.. తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్‌ను స్థాపించి భారతదేశంలోని అన్ని ఇండస్ట్రీలో సినిమాలు తీసిన ఏకైక అగ్ర నిర్మాతగా పేరు తెచ్చుకున్నాడు రామానాయుడు.
ఆయన తర్వాత ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఆయన పెద్ద కొడుకు సురేష్ బాబు కూడా టాలీవుడ్ లోనే అగ్ర నిర్మాతగా కొనసాగుతున్నాడు. ఆయన చిన్న కొడుకు వెంకటేష్ కూడా టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరోగా ఉన్నారు. ఈ ఫ్యామిలీ నుంచి మూడో తరం వారసులుగా వచ్చిన రానా పాన్ ఇండియా లెవల్ హీరోగా ఉన్నారు. ఇక రానా తమ్ముడు అభిరాం కూడా అహింసతో హీరో అయిపోయాడు.
మిగిలిన స్టార్ హీరోల మాదిరిగా వెంకటేష్ తన ఫ్యామిలీ గురించి ఎప్పుడు ప్రేక్షకులకు అంతగా పరిచయం చేయలేదు. వెంకటేష్ తన పిల్లలతో పాటు భార్య గురించి కూడా ఎక్కడా ఎప్పుడు మాట్లాడిన సందర్భాలు కూడా లేవు. అంతేకాకుండా భార్యతో కలిసి ఎక్కడ పెద్దగా బయట కనపడడం కూడా తక్కువే. రామ్‌చరణ్ పెళ్లి టైంలో మాత్రమే వెంకీ తన భార్యతో కలిసి వచ్చారు.
వెంకటేష్ భార్య పేరు నీరజ. ఆమెది ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా మదనపల్లె. నీరజ కూడా వెంకటేష్ లాగానే విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసింది. తర్వాత ఈ రెండు కుటుంబల పెద్దలు వెంకటేష్ – నీరజ పెళ్లిని ఎంతో ఘనంగా చేశారు. ఎప్పుడూ సినిమాలతో ఎంతో బిజీగా ఉండే వెంకటేష్.. కుటుంబ బాధ్యతలు అన్నీ తానే తీసుకొని అంతా చక్కదిద్దుతుంది నీరజ.
నీరజకు మొదటి నుంచి కూడా మీడియా ముందుకు రావడం ఇష్టం లేదట అందుకే పెద్దగా ఫంక్షన్స్ కి కూడా వచ్చేందుకు ఇష్టపడరు. ఇక నీరజ ఏపీ మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ నాయకుడు కామినేని శ్రీనివాస్‌కు స్వయానా మేనకోడలు కావడం విశేషం. నీరజ అక్క తూర్పుగోదావరి జిల్లా ఆంధ్రాసుగర్స్ ఎండీ పెండ్యాల అచ్చిబాబు భార్య.