సినీ ఇండస్ట్రీలో కొందరిని ఎప్పటికి మర్చిపోలేం. వారు చేసిన సినిమాలు, వారు చేరిన పాత్రలు ఎప్పటికి గుర్తుండిపోతాయి. ఈ కనిపిస్తున్న ఫొటోలో మహానటి సావిత్రితో పాటు ఉన్న హీరో ఒక లెజెండ్. ఆయన చేసిన సినిమాలు, పాత్రలు అంత త్వగర మర్చిపోలేం. పాత్ర ఏదైనా సరే ప్రాణం పెట్టి చేయడం కొందరితోనే అవుతుంది. ఆ పాత్రలు ఎన్నేళ్ళైన మనతోనే ఉండిపోతాయి. ఈ ఫొటోలో ఉన్న హీరో ఇంకెవరో కాదు.. లోక నాయకుడు కమల్‌హాసన్.
ఏంటి షాక్ అయ్యారా..నిజమే సావిత్రితో ఉన్న ఈ పిల్లాడు కమల్‌హాసన్. ఆరు పదుల వయసులోనూ యాక్షన్ సీన్స్‌లో తన మార్క్ ని చూపిస్తున్నాడు. తాజగా విక్రమ్ సినిమాతో బెస్ట్ కంబ్యాక్ ఇచ్చారు. విక్రమ్ సినిమా కొత్త రికార్డ్స్ ని సృష్టించింది. బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కమల్‌హాసన్ తన నటనతో దేశం మొత్తాన్ని ఉర్రూతలూగిస్తున్నాడు. ఎన్నో సక్సెస్ లు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూసారు. ఎంతో మంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపాడు.
50 ఏళ్ళ కెరీర్ లో ఆయన చేయని పాత్ర ఉండదేమో అనిపిస్తుంది. మరియు ఆయన చేయని పని కూడా ఉండదేమో. సినీ ఇండస్ట్రీలో కమల్‌హాసన్ నటుడిగానే కాకుండా.. దర్శకుడిగా, రచయితగా, నిర్మాతగా, సింగర్‌గా, మేకప్ మ్యాన్‌గా తన సత్తా చాటారు. 1960లో వచ్చిన ‘కలాదూర్ కన్నమ్మ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరో అయ్యారు. కలాదూర్ కన్నమ్మ సినిమాలో సావిత్రి కుమారుడిగా నటించారు. ఈ సినిమా మాత్రమే కాదు ఆరుకుపైగా సినిమాల్లో నటించారు.
దర్శకుడు బాలచందర్..కమల్ ను హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఆ తరువాత వీరిద్దరో కాంబినేషన్ లో సినిమాలు వచ్చాయి. ఎన్నో హిట్ సినిమాలు వీరిద్దరి కంబిన్షన్ లో వచ్చాయి. కమల్‌హాసన్ ఎన్నో జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇప్పుడు పొలిటికల్ కూడా కమల్‌హాసన్ బిజీ అయ్యారు. ‘మక్కల్ నీది మయ్యం’ పేరుతో ఓ రాజకీయ పార్టీ పెట్టి.. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.