చిత్ర పరిశ్రమలో ఉన్న నటీనటులకు ఎన్నో సెంటిమెంట్లు ఉంటాయి. కొందరి హీరోలకు ఓ తేదీ బాగా కలిసి వస్తుంది. ఆ తేదీన వచ్చిన ప్రతి సినిమా ఆ హీరోకు హిట్ సినిమాగా నిలుస్తుంది.. కొందరికి ఓ నెల అసలు కలిసి రాదు.. ఆ నెలలో ఏ సినిమా వచ్చినా వారికి భారీ నష్టాలను మిగులుస్తుంది. ఇప్పుడు ఇదేవిధంగా టాలీవుడ్ లోని ఓ స్టార్ హీరోకు ఓ నెల మాత్రం ఆయన కెరియర్ లో భారీ ప్లాపులు తెచ్చిపెట్టింది.
ఇంతకీ ఆ స్టార్ హీరో మరెవరో కాదు సూపర్ స్టార్ మహేష్ బాబు. దిగ్గజ నటుడు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని అందిపుచ్చుకునీ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించాడు మహేష్. రాజకుమారుడు సినిమాతో సోలో హీరోగా మారాడు. ఎంతో సినీ బ్యాగ్రౌండ్ ఉన్న మహేష్ హీరోగా సెట్ అయ్యేందుకు, సూపర్ స్టార్ అనిపించేందుకు ఎంతో కష్టపడ్డాడు..ఇక ప్రస్తుతం టాలీవుడ్ హీరోలనే నెంబర్ వన్ హీరోగా మహేష్ దూసుకుపోతున్నాడు.
తన కెరీర్‌లో ఇప్పటి వరకు 27 సినిమాల్లో నటించిన మహేష్ ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలోతన 28వ సినిమాలో నటిస్తున్నాడు. మహేష్ చేసిన సినిమాల్లో కొన్ని ఇండస్ట్రీ హిట్లు ఉండగా, మరికొన్ని హిట్ సినిమాలుగా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్ గా కూడా మిగిలిపోయాయి.. మహేష్ డిజాస్టర్ సినిమాల్లో చాలావరకు మే నెలలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
మే నెల అనేది మహేష్‌కు బ్యాడ్ సెంటిమెంట్ గా మిగిలిపోయింది. మే నెలలో రిలీజ్ అయిన మహేష్ సినిమాలలో నిజం ఒకటి. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2003 మే 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎస్ జె సూర్య దర్శకత్వంలో మహేష్ నటించిన నాని కూడా 2004 మే 14న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయ్యింది.
చాలా సంవత్సరాల తర్వాత మే నెలలో మహేష్ బాబు నటించిన బ్రహ్మోత్సవం కూడా 2016 మేలో రిలీజ్ అయ్యి మనోడి కెరీర్‌లోనే అత్యంత డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక మళ్లీ గత సంవత్సరం మే 12న పరుశురామ్ దర్శకత్వంలో వచ్చిన `సర్కారు వారి పాట` సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా కమర్షియల్ ప్లాప్. అలా మే నెల మహేష్‌కు కలిసి రాని నెలగా మిగిలిపోయింది.