అల్లు అర్జున్ తో ఉన్న ఈ పాప ఎన్టీఆర్‌కి ఏమవుతుందో తెలుసా… రాబోయే కాలంలో హీరోయిన్‌ట…!

సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా వచ్చి ఆ తర్వాత హీరోయిన్లుగా, హీరోలుగా మారిన స్టార్స్ ఎంతోమంది ఉన్నారు. అయితే మరికొందరు ఒకటి రెండు సినిమాలకే ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతున్నారు. ఈ లిస్ట్‌లోకే వస్తుంది ఇక్కడ మీరు చూస్తున్న ఈ చిన్నారి పాప. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా పాపులారిటీని సంపాదించుకున్న అల్లు అర్జున్‌తో కలిసి సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో నటించిన ఈ పాప గుర్తుండే ఉంటుంది .

మరిచిపోయే నటన అయితే కాదు. మొదటి సినిమాలోనే మంచి ఎక్స్ప్రెషన్స్ ఇచ్చి ముద్దుగా అనిపించింది. అయితే ఈ పాప పేరు వర్ణిక. అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమాలో తన ముద్దు ముద్దు మాటలతో ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేసింది ఈ చిన్న‌ది.ఆ తర్వాత కొన్ని రోజులు సినిమా ఇండస్ట్రీకి దూరమైంది. మళ్లీ నాన్నకు ప్రేమతో అనే సినిమాతో ప్రేక్షకులకు కనిపించి మెప్పించింది.

ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ చిన్నప్పటి క్యారెక్టర్ లో నటించింది. ఆ తర్వాత పూర్తిగా సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ఈ చిన్నారి పాప ఇప్పుడు శ్రద్ధ చదువు పైన పెట్టిందట. అంతేకాదు పెద్దయ్యాక ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలని కూడా ఫిక్స్ అయిందట. అందుకే ముందు బాగా చదువుకోని ఆ తర్వాత సినిమాలోకి హీరోయిన్ గా రావాలని ఫిక్స్ అయిందట. ఇక రాబోయే కాలంలో ఈ పాప సినిమా ఇండస్ట్రీలోకి వస్తుందో లేదు చూడాలి.