టాలీవుడ్‌లో రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి సినిమా అప్పట్లో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేసింది. ఈ సినిమాతో ఉత్తరప్రదేశ్ బ్యూటీ దీప్తి భట్నాగర్ హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. రాఘవేంద్రుడు పరిచయం చేసిన అందాల ముద్దుగుమ్మలలో దీప్తి కూడా ఒకరు. తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన దీప్తి టాలీవుడ్ లో బాగా ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ బిజీ హీరోయిన్ అయ్యారు.
నాగార్జునతో ఆటోడ్రైవర్ – బాలయ్యతో సుల్తాన్ – మా అన్నయ్య కొండవీటి సింహాసనం లాంటి సినిమాలలో నటించారు. ఆమె చివరగా మల్లూవుడ్ సినిమా రాఖీలి పట్టులో కనిపించారు. ఆ తర్వాత బాలీవుడ్ దర్శకుడు రణదీప్ ఆర్యని పెళ్లి చేసుకుని ఎంచెక్కా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తోంది. ఇప్పుడు దీప్తికి ఇద్దరు కుమారులు. హీరోయిన్గా ఉన్నప్పుడే దీప్తి ఒక బ్యానర్ స్థాపించి పలు టీవీ షోలు నిర్మించారు.
ఇప్పుడు కూడా ఆ బ్యానర్ పై టీవీ షోలు నిర్మిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత దీప్తి శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా వచ్చిన రెండో పెళ్లి సందడి సినిమాతో మళ్లీ కం బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వయసు 55 సంవత్సరాలు. తాజాగా ఆమె తన ఫోటోని ఇన్‌స్టాల్ షేర్ చేసుకున్నారు. స్విమ్మింగ్ పూల్ లో కెమెరాకి ఫోజులు ఇచ్చింది. కళ్ళకు నల్లటి అద్దాలు నాజూకైన సొబగులతో దీప్తి అందాలు చూస్తుంటే అసలు ఆమె వయసు నిజంగానే 55 సంవత్సరాలు ఉంటుందా ? అన్నట్టుగా ఉంది.
పెళ్లిసందడి సినిమా వచ్చిన టైంలో అసలు దీప్తిని చూస్తుంటే చాలా మంది కళ్లకు నిద్రలే ఉండేవే కాదు. ఆమె కోసం రిపీటెడ్‌గా పెళ్లిసందడి సినిమాలు చూసిన రోజులు ఉన్నాయి. అంతటి కత్తిలాంటి ఫిగర్ దీప్తిది. ఆ సినిమా వచ్చి 25 ఏళ్లు అవుతున్నా దీప్తిని కవ్వింపుల్లో కైఫు అయితే తగ్గలేదు.