టాలీవుడ్‌లోనే టాప్ – 5 ప్రి రిలీజ్ బిజినెస్ సినిమాలు ఇవే… రికార్డుల దుమ్ము రేపిన హీరోలు వీళ్లే…!

టాలీవుడ్ లో సీనియర్ హీరోలు, టాప్ హీరోలు, స్టార్ హీరోలు, యంగ్ హీరోలు అంటూ అందరికీ సపరేట్ కాటగిరీలు ఉన్నాయి. సినిమాల పరంగా పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ఎప్పుడు ఏ సినిమా బాక్స్ ఆఫీస్ వ‌ద్ద‌ దుమ్ము లేపుతుందో ఎవ‌రు ? చెప్పలేరు. కొన్ని సినిమాలు చిన్నవి అయినా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాలను నమోదు చేస్తుంటాయి. కొన్ని సినిమాలు భారీ హైప్‌తో వ‌చ్చినా అప్పుడప్పుడు అంచనాలు తప్పుతూ ఉంటాయి.

Sye Raa Narasimha Reddy Telugu Movie: The Real Story Epic Celebrating a  Forgotten Hero!

ఇక మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలు ప్ర‌స్తుతం పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తు దూసుకుపోతున్నారు. తెలుగుతో పాటు అన్నీ భాషాలో కూడా మ‌న స్టార్ల‌ సినిమాల‌కు ప్రి రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లోనే జ‌రుగుతోంది. మ‌న టాలీవుడ్ స్టార్ హీరోలలో టాప్ 5 బిగ్గెస్ట్ ప్రి రిలీజ్ బిజినెస్ మూవీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వాటిలో ముందుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజామౌళి తెర‌కెక్కించిన బాహుబ‌లి టాలీవుడ్‌లో ఏకంగా రూ. 122 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా నిలిచింది.

RRR (2022) - IMDb

ఇక ఈ సినిమా త‌ర్వాత కూడా రాజామౌళి తెర‌కెక్కించిన మ‌రో బిగ్గెస్ట్ మ‌ల్టీస్టార‌ర్ త్రిబుల్ ఆర్ కూడా ఏకంగా ఎవ‌రు ఉహించ‌ని విధంగా రూ. 240 కోట్ల ప్రి రీలిజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా త‌ర్వాత చిరంజీవి సైరా కూడా ఇదే ర‌కాంగా భారీ బిజినెస్ చేసింది. ఈ సినిమా చిరంజీవి కెరీర్‌లో అత్య‌ధిక ప్రి రిలీజ్ బిజినెస్‌ చేసిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా రూ.111.48 కోట్ల బిజినెస్ చేసింది.

Adipurush - Wikipedia

అలాగే పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ న‌టించిన సాహో సినిమా కూడా టాలీవుడ్‌లో అత్య‌ధిక ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా రూ.124కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి పాన్ ఇండియా హీరో ప్ర‌భాస్ న‌టించిన ఆదిపురుష్ కూడా ఏకంగా రూ. 170 కోట్ల భారీ ప్రి రిలీజ్ బిజినెస్ చెసుకుంది. ఇలా మ‌న‌ టాలీవుడ్ స్టార్ హీరోలు న‌టించిన ఈ సినిమాలు ప్రి రిలీజ్ బిజినెస్‌ల్లో దుమ్ము రేపే రికార్డుల‌ను న‌మోదు చేశాయి.

Bahubali 2 - The Conclusion Full Movie Online - Watch HD Movies on Airtel  Xstream Play