చిత్ర పరిశ్రమలో కొంతమంది నటులు తమ కెరియర్ మంచి పిక్స్‌లో ఉన్న సమయంలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. చిత్ర పరిశ్రమలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటూ ఎన్నో సినిమాలు చేయాల్సి ఉండగానే మరణించిన నటులు ఉన్నారు. అలా ఇండస్ట్రీ నుంచి సడెన్‌గా ఈ లోకానికి దూరమైన నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం.
శ్రీహరి :
తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అక్కర్లేని నటుడు శ్రీహరి.. ఎన్నో సినిమాల్లో విలన్ గా హీరోగా క్యాటర్‌ఆర్టిస్ట్ గా ఎన్నో విలక్షణ పాత్రలో నటించి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. శ్రీహరి తెలుగుతోపాటు తమిళ, కన్నడ సినిమాల్లో కూడా నటించారు. అయితే శ్రీహరి తన సినిమాలు చేస్తున్న సమయంలోనే అనారోగ్యానికి గురై ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు.
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ :
పునీత్ కూడా రెండు సంవత్సరాల క్రితం మరణించిన విషయం తెలిసిందే. జిమ్లో వర్కౌట్ చేస్తుండగా గుండెపోటు రావటంతో ఈయన మరణించారు. పునీత్ కెరీర్ ప్రస్తుతం మంచి పీక్స్ లో ఉంది. చాలా మంచి ఫామ్‌లో ఉన్న సమయంలోనే పునీత్ మరణించడం ఆయన అభిమానులతో పాటు భారత చిత్ర పరిశ్రమని కలచివేసింది.
రఘువరన్ :
సౌత్ చిత్ర పరిశ్రమలోనే పరిచయం అక్కర్లేని మరో అగ్ర నటుడు రఘువరన్. విలన్ పాత్రలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రఘువరన్. 200కు పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. 59 ఏళ్ళ వయసులోనే అనారోగ్యం కారణంగా ఈయన మరణించాడు.
వేణుమాధవ్:
తన కామెడీతో తెలుగు ప్రేక్షకులకు వినదాన్ని అందించిన వేణుమాధవ్. దాదాపు 500 సినిమాల్లో నటించి మెప్పించాడు. ఈయన కూడా అనారోగ్యం కారణంగా మరణించారు. వేణుమాధవ్ కాకుండా ఎందరో అగ్ర కమెడియన్లు కూడా అనారోగ్య కారణంతో టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు తీరని దుఃఖాన్ని మిగిల్చి వెళ్లిపోయారు.
ఉదయ్ కిరణ్:
20 ఏళ్ల క్రితం వరుసగా చిత్రం, నువ్వునేను, మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్లతో అప్పట్లో స్టార్ హీరోలకే పోటీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకుని అర్దాంతరంగా తనువు చాలించాడు. ఉదయ్‌కు ఎంతో మంచి భవిష్యత్తు ఉండగానే ఈ పని చేశాడు.
ప్రత్యూష :
ప్రత్యూష కూడా చిన్న వయస్సులోనే మంచి సినిమాలతో తిరుగులేని క్రేజ్ తెచ్చుకుంది. ఆమె ప్రియుడు చేసిన మోసంతో ప్రత్యూష అనుమానాస్పద స్థితిలో 2002లో మృతి చెందింది.
నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగిన నటి ఆర్తి అగర్వాల్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. కొంతకాలం తర్వాత ఆర్తి కెరీర్ డీలా పడింది. ఆ తర్వాత వివాహం చేసుకుని అమెరికా వెళ్ళింది. కానీ గొడవల కారణం గా భర్తతో విడాకులు తీసుకుంది. సన్నబడాలని ఆర్తి లైపో థెరపీ ఆపరేషన్ చేసుకుంది. ఆపరేషన్ ఫెయిల్ అవడంతో మృతి చెందింది. ఇలా వీరే కాకుండా చిత్ర పరిశ్రమకు దుఃఖాన్ని మిగిలుస్తూ మరణిస్తూనే ఉన్నారు.