లేటు వయసులో అలాంటి పనులు చేసిన స్టార్ హీరోలు వీళ్ళే..!

ప్రేమ అనేది ఎప్పుడు ఎవరి జీవితంలో ఎప్పుడు ఎక్కడ పుడుతుందో ఎవరూ చెప్పలేరు. అలాంటి ప్రేమ ఈ వయసులోనే పుట్టాలనే రూలేమీ లేదు.. ప్రేమించడానికి ప్రేమను పంచడానికి వయసుతో సంబంధం ఉండదు..వయస్సు అనేది ఒక నెంబర్ మాత్రమే.. అది మన శరీరానికి మాత్రమే వర్తిస్తుంది.. మనసుకు వయసుతో సంబంధం ఉండదు. ఈ విషయం నేను చెప్పడం లేదు.. తమ వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకున్న ఈ సెలబ్రిటీ జంటలు చెబుతున్నాయి. లేటు వయసులో నిజమైన ప్రేమను చూసి పెళ్లి చేసుకున్న సెలబ్రిటీ జంటలు ఎవరో ఒకసారి చూద్దాం.

సంజయ్ దత్: బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సంజయ్ దత్ తన వ్యక్తిగత జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు.. సంజయ్ ముందుగా 1987లో రిచా శర్మని వివాహం చేసుకున్నాడు.. ఇక ఈ ఇద్దరికీ త్రిషలా దత్ అనే కుమార్తె కూడా ఉంది. అదే సమయంలో రీచా బ్రెయిన్ ట్యూబర్ కారణంగా మరణించింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి సంజయ్ దత్ రియా పిళ్లై అనే అమ్మాయిని మరో వివాహం చేసుకున్నాడు. అయితే వీరి వివాహం కూడా ఎన్నో సంవత్సరాల నిలవలేదు. వారి మధ్య మనస్పర్ధలు రావడంతో మధ్యలో విడిపోయారు. ఆ తర్వాత 50 సంవత్సరాల వయసులో సంజయ్ దత్ 2008లో ఆయన మాన్యతా దత్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

కబీర్ బేడి: బాలీవుడ్ మరో సీనియర్ నటుడు కబీర్ బేడీ కూడా లేటు వయసులో ప్రేమలో పడ్డాడు.. అయినా వ్యక్తిగత జీవితంలో నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారు. కబీర్ ముందుగా 1969 లో ప్రొతిమా బేడీని పెళ్లి చేసుకున్నాడు.. కానీ ఈ జంట 1977లో విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత వ‌బీర్‌ బ్రిటీష్ ఫ్యాషన్ డిజైనర్ సుసాన్ హంఫ్రీస్ను వివాహం చేసుకోగా అది కూడా విడాకులకు దారితీసింది. టీవీ రేడియో ప్రెజెంటర్ నిక్కీ బేడీ కబీర్ ని మూడో వివాహం చేసుకోగా ఆ బంధం కూడా 2005లొ ముగిసింది. ఇక చివరిగా 2016లో70 ఏళ్ల వయసులో నిజమైన ప్రేమను పొంది పర్వీన్ దుసాంజ్ను పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య ఏజ్ గా 29 సంవత్సరాలు కావటం మరో విశేషం.

నీనా గుప్తా: ఇక మరో సీనియర్ హీరోయిన్ నీనా గుప్తా కూడా లేటు వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకుంది.1989లో నీనా ఆమె అప్పటి ప్రియుడు మాజీ వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో ప్రేమ‌లో ప‌డి ఓ కుమార్తెకు జన్మినిచ్చారు. అయితే.. అప్పటికే వివియన్‌కు పెళ్లి కావడంతో కూతురు మసాబాను నీనా ఒంటరిగా పెంచింది. చాలా సంవత్సరాల తర్వాత 2008లో ఈమె తన 50వ ఏట చార్టర్డ్ అకౌంటెంట్ వివేక్ మెహ్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

ఊర్మిళ మటోండ్కర్: నటి ఊర్మిళా మటోండ్కర్ కూడా లేటు వయసులో ప్రేమ పెళ్లి చేసుకున్నవారే. 2016లో బాంద్రాలోని తన ఇంట్లో కాశ్మీర్‌కు చెందిన వ్యాపారవేత్త మొహ్సిన్ అక్తర్ను ఆమె పెళ్లా చేసుకున్నారు. పెళ్లి సమయానికి ఆమె వయసు 42ఏళ్లు కావడం గమనార్హం.

ఆశీష్ విద్యార్థి: ప్రముఖ టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ విలన్ ఆశీష్ విద్యార్ధి తన 60 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. అస్సాం కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ రూపాలి బరువతో మరి కొత్త జీవితంలో అడుగుపెట్టాడు. ఇలా ప్రేమకి వయసుతో సంబంధం లేకుండా లేటు వయసులో కూడా పెళ్లి చేసుకుని తమ ప్రేమను ఆస్వాదిస్తున్నారు