చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారి పేర్లు ముందు బిరుదులు ఉండటం కామన్. ఇప్పటినుంచి వస్తున్నా ఆనవాయితీ కాదు ఎన్నో సంవత్సరాల నుంచి ప్రేక్షకులు తమ అభిమాన హీరోకు వారు ఆ బిరుదులు పెడుతూ ఉంటారు. అలా ఆ హీరోలు వచ్చిన కొత్తలో ఉండే బిరుదులకు.. తర్వాత వారు స్టార్ హీరోలుగా మారిన తర్వాత వచ్చే బిరుదులకు చాలా మార్పులు ఉంటాయి. తాజాగా ఇప్పుడు నటసింహం నందమూరి బాలయ్య కు మరో కొత్త బిరుదు వచ్చి చేరింది.
నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ నట వారసుడుగా చిత్రపరిశ్రమలో అడుగు పెట్టాడు. బాలయ్య కూడా తన నటనతో తన తండ్రికి తగ్గ నటుడుగా అనిపించుకున్నాడు. ఎన్టీఆర్‌ను అందరూ నటరత్న అనే బిరుదు తో పిలిచేవారు. బాలయ్యను అభిమానులు ముద్దుగా యువరత్నగా పిలవడం ప్రారంభించారు. తర్వాత బలయ్య నటించిన సింహా సూపర్ హిట్ అయిన తర్వాత నుంచి బాలయ్యను నటసింహమని పిలవడం మొదలుపెట్టారు. ఇక ఎప్పుడు తాజాగా బాలయ్య నటిస్తున్న ‘భగవంత్ కేసరి’ సినిమాతో గ్లోబల్ లయన్ అని బిరుదును అందుకున్నాడు. ఇలా బాలయ్య తన కెరీర్లో యువరత్న నుంచి నటసింహం ఇప్పుడు గ్లోబల్ లయన్ గా మారాడు.
ఇలా చిత్ర పరిశ్రమలో బాలయ్య కాకుండా ఎందరో హీరోలకు మొదటిలో వచ్చిన బిరుదులు కాకుండా తర్వాత కొన్ని బిరుదులు వచ్చాయి. అలా బిరుదులు వచ్చిన వారిలో మెగాస్టార్ చిరంజీవిని ముందుగా సుప్రీం హీరో అన్నారు.. తర్వాత మెగాస్టార్ గా పిలవడం మొదలుపెట్టారు. ఇక ఎప్పుడు టాలీవుడ్ కి గాడ్ ఫాదర్ అంటూ చిరంజీవిని పిలుస్తున్నారు. అలాగే రామ్ చరణ్ కూడా ముందుగా మెగా పవర్ స్టార్ అంటూ పిలవడం మొదలుపెట్టారు. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత నుంచి గ్లోబల్ పవర్ స్టార్ గా మరో బిరుదు ఇచ్చారు.
మరో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌ను అందరూ స్టైలిష్ స్టార్ అంటూ ముద్దుగా పిలుస్తారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ గా మారాడు. ఇక మరో పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని ముందుగా యంగ్ రెబల్ స్టార్ అని పిలిచేవారు. బాహుబలి సినిమాల తర్వాత నుంచి ప్రభాస్‌ను పాన్ ఇండియా స్టార్ అంటూ పిలవడంం మొదలుపెట్టారు.
నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా చిత్ర పరిశ్రమకు వచ్చిన నాగార్జునను అందరూ యువ సామ్రాట్ ఉంటూ పిలవడం ప్రారంభించారు. ఆయన తర్వాత నాగ్ తనయుడు నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ యువ సామ్రాట్ బిరుదును నాగచైతన్యకు ఇచ్చేసాడు. ప్రస్తుతం నాగ్‌ను కింగ్ అని పిలుస్తున్నాడు. మరో స్టార్ హీరో మహేష్ బాబుని కూడా తన కెరీర్ మొదటిలో ప్రిన్స్ అని పిలవడం మొదలుపెట్టారు. తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో పండుగాడుగా మరాడు. తర్వాత వరుస విజయాలు అందుకోవటంతో తన తండ్రి సూపర్ స్టార్ బిరుదును మహేష్ బాబు అందుకున్నాడు.
రవితేజ ను ముందుగా అభిమానులు మాస్ హీరో అంటూ పిలిచేవారు. ఆ తర్వాత డాన్ శీను మూవీ నుంచి రవితేజ కాస్త మాస్ మహారాజ్ అయ్యారు. కృష్ణను అభిమానులు అందరూ నటశేఖర అంటూ పిలిచేవారు. ఆ తర్వాత నట శేఖర నుంచి ఓ పత్రిక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ ఎవరంటూ ఓ పోల్ పెడితే.. అందులో కృష్ణకు సూపర్ స్టార్ అంటూ ఎక్కువ ఓట్లు వచ్చాయి. దీంతో సదరు పత్రిక నట శేఖర కృష్ణకు సూపర్ స్టార్ బిరుదును ప్రధానం చేసాయి. అప్పటి నుంచి నట శేఖర కృష్ణ కాస్తా సూపర్ స్టార్ కృష్ణ అయ్యారు. ఇలా ఎందరో హీరోలు తమ కెరీర్ మొదట్లో అందుకున్న బిరుదు ఒకటి తర్వాత మారిన బిరుదు ఒకటి. బాలయ్య బిరుదు మరోసారి మారటంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.