ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరో, హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకున్న చాలామంది నటీనట్లు వారి చిన్నతనంలోనే కాలేజ్ మానేసి మరి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌డం సంపాదించుకున్నారు. మధ్యలోనే చదువు మానేసి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ యాక్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న వారెవరో ఒకసారి చూద్దాం.
పవన్ కళ్యాణ్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్కూల్ ఎడ్యుకేషన్ అంత అంత మాత్రం గానే ఉండేదట. ఇంటర్మీడియట్ అయితే పాస్ కూడా కాలేదు. కానీ అతడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. చిరంజీవి బ్యాగ్రౌండ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకంటూ ఒక యూనిక్ ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు. తాజాగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టడు పవన్.
అమీర్ ఖాన్ :
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మోంజీ కాలేజ్‌లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి తర్వాత చదువును మానేశాడు. ఒక థియేటర్ కంపెనీలో జాయిన్ అయ్యి నటన మీద కాన్‌సంట్రేషన్ చేశాడు. అలా చిన్న చిన్న సినిమాలతో మొదలుపెట్టి బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అయ్యాడు.
అలియా భట్ :
అలియా భట్ తన స్కూలింగ్ ఏజ్ లోనే చదువు మానేసి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాల్లో రాణించాలని ఆశపడింది. ఆలియా తాను అనుకున్నట్టే స్కూల్ ఎడ్యుకేషన్ తో చదువు ఆపేసి సినిమాల్లో సక్సెస్ అయ్యింది. పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్లలో ఆలియా ఒకటి.
సల్మాన్ ఖాన్ :
కండల వీరుడు సల్మాన్ ఖాన్ కాలేజ్ డ్రాప్అ వుట్ స్టూడెంట్. ముంబైలో సెయింట్ జోవిఎస్ కాలేజీలో చదువు మానేసిన సల్మాన్ ఖాన్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా తన కెరీర్ స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత హీరోగా మారి అంచలంచలుగా ఎదుగుతూ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొని బి టౌన్ భాయిజాన్‌గా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు.
దీపిక పదుకొనే :
దీపికా పదుకొనే తన స్వగ్రామం మౌంట్ కార్మెర్ట్ హైస్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీలో సోషియాలజీలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ లో జాయినై మోడలింగ్ పై కాన్సన్ట్రేషన్ తగ్గుతుందన్న ఉద్దేశంతో చదువును మానేసింది. దీపిక నటనలోనే కాక క్రీడా పరంగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోయినఃగా ఫుల్ క్రేజ్ తో దూసుకుపోతుంది దీపిక.
అక్షయ్ కుమార్ :
ముంబై డాన్ బాస్కో స్కూల్ లో చదివిన అక్షయ్ ఛెఫ్‌గా మంచి పేరు సంపాదించుకోవాలని మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలని ఉద్దేశంతో తన సెకండరీ ఎడ్యుకేషన్ మధ్యలోనే మానేశాడు.
ప్రియాంక చోప్రా :
ప్రియాంక చోప్రా సైకాలజిస్ట్ కావాలనుకుందట. కానీ పాఠశాల విద్య పూర్తి చేసిన తర్వాత తన మోడలింగ్ వృత్తిని కొనసాగించడానికి స్టడీస్ ఆపేసింది.
ఇలానే కత్రినా కైఫ్, అర్జున్ కపూర్, కరీనా కపూర్ ఖాన్, సోనం కపూర్ ఇలా చాలామంది వారి ఎడ్యుకేషన్ మధ్యలోనే ఆపేసి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్‌డంను సంపాదించుకున్నారు.