ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన్న సావిత్రి కేవలం సాంప్రదాయ పాత్రలోనే నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తరంలో సౌందర్య కూడా ఇదే విధంగా గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ సాంప్రదాయపద్ధమైన సినిమాల్లోనే నటించి స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంటూ అగ్రతారలా అందరి సరసన నటించింది. ఈ తరం హీరోయిన్స్ అంతా దాదాపు గ్లామర్ షోల్ చేస్తూ కథలో కంటెంట్ లేకపోయినప్పటికీ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కితే ఓకే చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు.
సాయి పల్లవి మాత్రం ఈ తరం హీరోయిన్స్ అందరికీ ఆపోజిట్ గా నడుచుకుంటుంది. కేవలం సాంప్రదాయపద్ధమైన రోల్స్ లో మాత్రమే నటిస్తూ గ్లామర్‌షోకు దూరంగా ఉంటుంది సాయి పల్లవి. కథలో కంటెంట్ లేదనిపిస్తే ఎటువంటి స్టార్ హీరో సినిమా నైనా రిజెక్ట్ చేసేస్తుంది ఈ ట్రెడిషనల్ బ్యూటీ. సక్సెస్ రేట్లు.. ఆఫర్లు తగ్గుతున్నా సాయి పల్లవి మాత్రం ఏ మాత్రం తగ్గడంలేదు. కేవలం కథలో కంటెంట్ ఉండి తన రోల్ కు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే ఆ సినిమాలో నటిస్తుంది. గతంలో సావిత్రి, సౌందర్య గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉంటూ సినిమాల్లో నట్టించగా ప్రస్తుతం సాయి పల్లవి కూడా ఆ నటిమణుల జాబితాలో చేరిపోయింది.
సావిత్రి, సౌందర్య, సాయి పల్లవి వీరి ముగ్గురి పేర్లు “ఎస్” అనే పదంతో స్టార్ట్ అవ్వడం ఓ విశేషం. అప్పట్లో సౌందర్య, సావిత్రి వారు నటించిన సినిమాలు ఫ్లాప్ అయితే ఆ డబ్బులు వెనక్కి ఇచ్చే విషయంలో ఏమాత్రం ఆలోచించేవారు కాదట. కానీ ఈ విషయాలను బయటకు తెలియనిచ్చేవారు కాదట. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ స్టార్ హీరోయిన్స్ ముగ్గురిని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు నెటిజన్స్. వీళ్లు ముగ్గురు చాలా గ్రేట్ అని.. కేవలం సాంప్రదాయ రోల్స్ల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుని తమ సత్తాను చాటడం మామూలు విషయం కాదంటూ పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.