లేటు వయసులో పెళ్లి చేసుకుని పిల్లలు కన్న స్టార్ హీరోలు వీళ్లే..!

చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలామంది నటులు లేటు వయసులో పెళ్లి చేసుకుని పిల్లలను కుంటున్నారు.. అలాగే తాము పిల్లల్ని కనడానికి వయసుతో సంబంధం లేదని ఆ సినీ తారలు అంటున్నారు. చిత్ర పరిశ్రమలో 40 నుంచి 50 ఏళ్ల వయసులో పిల్లలకు జన్మనిచ్చిన నటీనటులు ఎవరో ఒకసారి చూద్దాం.

 These Are The Actors Who Got Married At A Late Age And Had Children, Dil Raaju ,-TeluguStop.com

కృష్ణంరాజు శ్యామలాదేవి: రెబల్ స్టార్ గా టాలీవుడ్ లో పేరు సంపాదించుకున్న కృష్ణంరాజు ముందుగా సీతాదేవిని వివాహం చేసుకున్నారు.. అయితే ఈమె పెళ్లి చేసుకున్న కొన్ని సంవత్సరాలకే మరణించడంతో.. తరవాత ఆమె సోదరి శ్యామలాదేవిని 1996లో వివాహం చేసుకున్నారు.. అలా ఈమెకు 50 సంవత్సరాల వయసులో ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కృష్ణంరాజు గత సంవత్సరం మరణించిన విషయం మనందరికీ తెలిసిందే.

Telugu Aamirkhan, Dilraju, Krishnamraju, Pawankalyan, Prakashraj, Sarathkumar-Mo

దిల్ రాజు వైగారెడ్డి: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు తెచ్చుకున్న దిల్ రాజు కూడా మొదట అనిత రెడ్డిని పెళ్లి చేసుకున్నాడు ఇక వారికి హన్షితా రెడ్డి అనే ఒక కుమార్తె కూడా ఉంది. ఇక దిల్ రాజు మొదటి భార్య అనిత రెడ్డి మరణించిన తర్వాత ఈయన 33 ఏళ్ల వైగా రెడ్డిని వివాహం చేసుకున్నాడు. ఇక ఈ జంటకు 2022లో ఒక బాబు జన్మించాడు. ఇక‌ ఇప్పుడు దిల్ రాజు వయసు ప్రస్తుతం 52 సంవత్సరాలుగా ఉంది.

Telugu Aamirkhan, Dilraju, Krishnamraju, Pawankalyan, Prakashraj, Sarathkumar-Mo

ప్రకాష్ రాజ్ పోనీ వర్మ: విలక్షణ నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజు కూడా 1994లో లలితా కుమారిని వివాహం చేసుకున్నాడు.. ఇక వీరికి ఇద్దరు అమ్మాయిలు కూడా ఉన్నారు. అయితే ఈ ఇద్దరూ ఎక్కువ కాలం కలిసి ఉండలేకపోయారు. ప్రకాష్ రాజ్ 2009లో లలిత కుమారికి విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత 2017లో పోనీ వర్మ అనే ఓ కొరియోగ్రాఫర్ ను వివాహం చేసుకున్నాడు. వీరికి వివాహం తర్వాత 2015లో వేదాంత్‌నే బాబు కూడా జన్మించాడు.

Telugu Aamirkhan, Dilraju, Krishnamraju, Pawankalyan, Prakashraj, Sarathkumar-Mo

పవన్ కళ్యాణ్:  అన్న లెజ్నెవా- మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా తన అన్నను మించిన క్రేజ్ ను అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఇంట్లో వారి కుదిరిచిన ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోగా.. తరవాత బద్రి సినిమాలో హీరోయిన్గా నటించిన రేణు దేశాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్‌కు అకీరా నందన్, ఆద్య కొణిదెల అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఇక తర్వాత పవన్ రేణుదేశాయ్‌ కూడా విడాకులు ఇచ్చి.. తీన్మార్ సినిమాలో నటించిన ఓ రష్యన్ అమ్మాయి అన్న లెజ్నెవాను వివాహం చేసుకున్నాడు. ఈ జంట ఒక బాబు ఒక అమ్మాయి కూడా జన్మించింది.

Telugu Aamirkhan, Dilraju, Krishnamraju, Pawankalyan, Prakashraj, Sarathkumar-Mo

శరత్ కుమార్ రాధిక: కోలీవుడ్, టాలీవుడ్ సీనియర్ నటుడు శరత్ కుమార్ 1984 లో ముందుగా ఛాయాదేవి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.. తరవాత 2000 సంవత్సరంలో ఆమెకు విడాకులుు ఇచ్చి ఆ మరుసటి సంవత్సరం స్టార్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకున్నాడు. ఈ జంట కి 2004లో రాహుల్ అనే అబ్బాయి కూడా ఉన్నాడు.

Telugu Aamirkhan, Dilraju, Krishnamraju, Pawankalyan, Prakashraj, Sarathkumar-Mo

అమీర్ ఖాన్ కిరణ్ రావు: బాలీవుడ్‌లో మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్ కూడా లగాన్ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్న‌ కిరణ్ రావు అనే తెలుగు అమ్మాయిని 2005లో రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు 2011లో ఆజాద్ రావ్ ఖాన్ అనే ఓ అబ్బాయి కూడా జన్మించాడు. ప్రస్తుతం ఈ జంట విడాకులు తీసుకోబోతున్నారని తెలుస్తుంది. ఇప్పుడు మరోసారి అమీర్ ఖాన్ మూడో పెళ్లి చేసుకొని పిల్లలు కనడానికి రెడీగా ఉన్నాడు. వీరే కాకుండా చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఇలానే ఉన్నారు