మెగాస్టార్ చిరంజీవి తన కెరీర్ లో ఇప్పటి వరకు 153 సినిమాల్లో నటించారు. చిరు తన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150తో రీ ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో హిట్ కొట్టిన చిరు ఈ ఆగస్టులో భోళాశంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే చిరు కెరీర్లో నటించినా మధ్యలోనే షూటింగ్ ఆగిపోయి రిలీజ్ కాని కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.
1- భూలోకదొంగ :
మెగాస్టార్ హీరోగా సింగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో భూలోక దొంగ ప్రారంభించారు. కథలో కొన్ని మిస్టేక్‌లు ఉన్నాయని.. మధ్యలోనే చిరు ఈ సినిమాను డ్రాప్ చేసేశారు.
2- అబూ బాగ్దాద్ గజదొంగ
చిరు హీరోగా పాన్ ఇండియా లెవెల్ లో అబూ బాగ్దాద్ గజదొంగ సినిమా అనౌన్స్ చేశారు. ఈ సినిమాను ఇండియాలోని అన్ని భాషలతో పాటు ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేయాలనుకున్నారు. మాస్టర్ సినిమా హిట్ తర్వాత ఆ సినిమా డైరెక్టర్ సురేష్ కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా అనుకున్నారు. అయితే భారీ బడ్జెట్ నేపథ్యంలో ఈ సినిమా మధ్యలోనే ఆపేశారు.
3- వజ్రాల దొంగ :
కొదండ రామిరెడ్డి డైరెక్షన్లో శ్రీదేవి నిర్మాణంలో వజ్రాల దొంగ అనే సినిమాకు పూజా కార్యక్రమం కూడా జరిగింది. కానీ ఆ తర్వాత చిరు – శ్రీదేవి ఇగో క్లాషెస్ వల్ల ఈ సినిమాకు బ్రేక్ పడింది.
4- ఎస్వీ కృష్ణారెడ్డి సినిమా:
ఎస్వీ కృష్ణారెడ్డి మాంచి ఫామ్‌లో ఉన్న టైంలో ఆయన దర్శకత్వంలో చిరంజీవి హీరోగా ఓ సినిమా ఎనౌన్స్ అయ్యి కూడా మధ్యలో ఆగిపోయింది.
5- ఆటోజానీ :
చిరు పదేళ్ల గ్యాప్ తర్వాత తన 150వ సినిమా చేయాలనుకున్నప్పుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ సినిమాను అనౌన్స్ చేశారు. కథ నచ్చక చిరు ఈ సినిమా వదిలేశారు. ఆ తర్వాత పూరి ఫీల్ అవుతూ చిరుపై పరోక్షంగా కామెంట్లు కూడా చేశారు.
6- వీఎన్. ఆదిత్య సినిమా :
మనసంతా నువ్వే సినిమా హిట్ అయ్యాక ఆ సినిమా డైరెక్టర్ వీఎన్. ఆదిత్యతో చిరంజీవి ఓ సినిమా చేయాలనుకున్నా మధ్యలోనే ఆగిపోయింది.
7- రాంగోపాల్ వర్మ సినిమా :
ఆర్జీవీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా టబూ, ఊర్మిళ హీరోయిన్లుగా వినాలని ఉంది అనే టైటిల్‌తో ఓ సినిమా స్టార్ట్ అయ్యింది. టబు, ఊర్మిళతో చిరుపై రెండు సాంగ్స్ షూట్ చేశారు. అశ్వనీదత్ ఈ సినిమా నిర్మాత. అయితే ఈ సినిమాలో షూట్ చేసిన సాంగ్స్ ఆ తర్వాత చూడాలని ఉంది సినిమా 50 రోజుల తర్వాత స్పెషల్ సాంగ్స్‌గా యాడ్ చేశారు.