శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గించే 5 ఆహారాలు ఇవే… వెరీ సింపుల్ టెక్నిక్‌…!

ప్రస్తుతం చాలామంది ప్రజలు సాధారణంగా ఇబ్బంది పడుతున్న సమస్య హై కొలెస్ట్రాల్. శరీరంలో కొలెస్ట్రాల్ అవసరం. కానీ పరిమితికి మించిన కొలెస్ట్రాల్ వల్ల హార్ట్ ఎటాక్ తో పాటు హార్ట్‌కి సంబంధించి అనేక సమస్యలు ఎదురవుతాయి. శరీరంలో హై కొలెస్ట్రాల్ పెరిగిపోవడం వల్ల గుండె గోడలు మందమై రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతోంది. దీనితో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బాడీకి తగిన పని చెప్పకపోవడం, డీప్ ఫ్రైడ్ ఆహారాన్ని తీసుకోవడం, ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ కొలెస్ట్రాల్ లెవ‌ల్స్‌ పెరిగిపోయి ఆరోగ్యానికి హాని చేస్తాయి. మీరు తినే ఆహారంలో కొన్ని ఆహారాలను అవాయిడ్ చేసి క్రింద ఇచ్చిన ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల గుండె గోడలలో పేరుకుపోయిన హై కొలెస్ట్రాల్ తగ్గించుకోవచ్చు.

ఓట్ మీల్ :
మయో క్లినిక్ ప్రకారం ఓట్ మీల్ ఒక ప్రోటీన్‌ఫుడ్. ఓట్స్ లో కరిగే ఫైబర్ ఉండడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి దీనికి ఉంటుంది. ఇది శరీరంలో ఉండే ఒక రకమైన చెడు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ఓట్ మిల్ ఊక తినడం వల్ల మరింత ప్రయోజనం ఉంటుంది.

ట్రోట్ ఫిష్ :
సార్డినెస్, ట్యూనా, ట్రోట్ ఫిష్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి . ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ధ‌మనులలో ట్రైగ్లిజరైడ్స్ తగ్గిస్తాయి. ట్రైగ్లిజరైడ్స్ కారణంగా గుండె గోడలు గట్టిపడడమే కాక రక్తం గడ్డకట్టే ప్రమాదం పెరుగుతుంది. ఇటువంటి సమస్యల నుంచి రక్షించుకోవడానికి ట్రోట్ ఫిష్ సహకరిస్తుంది.

నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్:
నాట్స్‌తో పాటు బాదం కూడా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను కలిగి ఉంటుంది. దీని వల్ల ఆరోగ్యం బలోపేతం అవ్వడమే కాక కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలు తగ్గించుకోవడానికి వాల్ న‌ట్స్ తినడం మంచిది.

అవకాడో :
అవకాడో లో మౌనోస్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ప్రతిరోజు ఒక అవకాడోను తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన అనేక వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చు. ఆవకాడో ఒక దివ్య ఔషధంగా పనిచేస్తుందని చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందని తాజాగా ఒక అధ్యయనం ప్రకారం తెలింది.

ఆలివ్ ఆయిల్ :
ఆలివ్ ఆయిల్‌లో తగినంత మోతాదులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనం తినే ఆహారంలో ఆలివ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల గుండె సమస్యలను తగ్గించుకోవచ్చు.