ఈ రీసెంట్ టైమ్స్ లో చిత్ర పరిశ్రమలో ఇది ఓ బాగా ట్రెండ్ గా మారిపోయింది. ఎవరైనా హీరోయిన్ ఆ విషయంలో రూటు మార్చి అభిమానులకు దగ్గర అయితే అదే స్టాటజీని ఫాలో అవుతూ సోషల్ మీడియాలో మరి కొంతమంది హీరోయిన్లు కూడా అలాగే చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు ఇదే లిస్టులో యాడ్ అయిపోయింది హైబ్రిడ్ ముద్దుగుమ్మ సాయి పల్లవి. తనదైన స్టైల్ లో సినిమాలు చేస్తూ లేడీ పవర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి కూడా స్టార్ హీరోయిన్ సమంత లానే షూటింగ్ లు చేయడానికి ఇష్టపడుతుందిట.
స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఖుషి సినిమా చేస్తుంది. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సమంత కాశ్మీర్లోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ చేసింది. ఇది ఇప్పుడు సాయి పల్లవి కూడా అదే ప్రయాణంలో నడవబోతుంది. సాయి పల్లవి కూడా తన సినిమాల షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్లబోతుందట. రాజ్ కుమార్ పేరి స్వామి దర్శకత్వంలో శివ కార్తికేయ హీరోగా నటిస్తున్న సినిమాలో సాయి పల్లవి కూడా నటిస్తుంది.
ఈ సినిమా తొలి షెడ్యూల్ ని కాశ్మీర్లో మొదలు పెట్టబోతున్నారు. వీటికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక దీంతో హీరోయిన్ సమంత ఎలా చేస్తుందో అలానే సాయి పల్లవి కూడా చేస్తుందంటూ ఇప్పుడు ఓ న్యూస్ వైరల్ గా మారింది. సమంత కూడా తన ఖుషి సినిమా షూటింగ్ని కాశ్మీర్ లోనే మొదలుపెట్టింది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా అప్పట్లో ఓ రేంజ్ లో వైరల్ గామారాయి. ఇక ఇప్పుడు సమంత లాగా సాయి పల్లవి కూడా చేస్తున్నాడంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ ను విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు.