బిజినెస్ రంగంలో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరోల భార్యలు వీళ్ళే.. నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా..?

ఇండస్ట్రీలో చాలామంది స్టార్ హీరోస్ సినీ రంగంలోనే కాక కొన్ని బిజినెస్ రంగాల్లోనూ అడుగు పెట్టి సక్సెస్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలే కాక వారి సతీమణులు కూడా చాలామంది బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టి సూపర్ సక్సెస్ సాధించారు. అలా బిజినెస్ రంగంలో అడుగుపెట్టి సక్సెస్ సాధించిన ఆ స్టార్ హీరోల భార్యలు ఎవరో ఒకసారి తెలుసుకుందాం.

నమ్రత శిరోద్కర్ – మహేష్ బాబు :
మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా వెలుగు వెలిగిన నమ్రత టాలీవుడ్ లో కూడా రెండు సినిమాల్లో నటించింది. నమ్రత – మహేష్ బాబు ప్రేమించి వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక వీరిద్దరు వివాహం తర్వాత నమ్రత సినిమాలకు గుడ్ బై చెప్పినా మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ బిజినెస్ చేసుకుంటుంది. మహేష్ బ్రాండ్ హంబుల్ అనే టెక్స్ట్ టెల్స్ ఇండస్ట్రీని స్టార్ట్ చేసింది. ఓవైపు వీటిని రన్ చేస్తూనే ఏఎంబి పేరుతో మల్టీప్లెక్స్ చూసుకుంటుంది.

లక్ష్మీ ప్రణతి – జూనియర్ ఎన్టీఆర్ :
ఆల్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి గురించి చాలామందికి తెలియదు. ఎన్ స్టూడియో అధినేత కూతురు లక్ష్మీ ప్రణతి త్వరలోనే ఎంటర్టైన్మెంట్ ఛానల్ ను స్టార్ట్ చేయబోతుందట.

ఉపాసన – రామ్ చరణ్ :
రామ్ చరణ్ భార్య ఉపాసన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు . ఎప్పుడు రాంచరణ్ కు సంబంధించిన అప్డేట్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ వుండే ఉపాసన.. అపోలో హాస్పిటల్ డైరెక్టర్గా వ్యవహరిస్తూనే ఎయిర్లైన్స్ బిజినెస్ లో యాక్టివ్ గా ఉంటుంది.

స్నేహ రెడ్డి – అల్లు అర్జున్ :
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక బన్నీ భార్య స్నేహ రెడ్డి కూడా ఎప్పుడు బిజినెస్ రంగంలో బిజీగా ఉంటుంది. ఆమె తండ్రి స్థాపించిన సెయింట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్గా వ్యవహరిస్తుంది.

అంజనా దేవి – నాని :
నాచురల్ స్టార్ నాని భార్య గురించి బయట ప్రపంచానికి చాలు తక్కువగా తెలుసు. ఆమె కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి. అంజనీ దేవి ఆర్కే మీడియాలో క్రియేటివ్ హెడ్ గా వర్క్ చేస్తుంది. ఈమె బాహుబలి సినిమాకు కూడా వర్క్ చేసింది.

విరూపా కంటమనేని – అల్లరి నరేష్ :
స్టార్ హీరో అల్లరి నరేష్ భార్య కూడా బిజినెస్ రంగంలో రాణిస్తుంది. ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థను రన్ చేస్తూ మంచి సక్సెస్ సాధించింది. ఈ రంగంలో చాలా అవార్డులను కూడా అందుకుంది.