సాధారణంగా సినీ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు అనేవి సహజం. వాటిని ఎదుర్కొని నిలబడినప్పుడే ఇండస్ట్రీలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు.. అయితే కొంతమంది ఇండస్ట్రీలో జరిగే కొన్ని విషయాలకు మనస్థాపం చెంది చేజేతులారా సినిమా కెరియర్ నే వదిలేసుకుని వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్స్ కూడా ఉన్నారు. అసలు విషయంలోకి అయితే సాధారణంగా సినిమాలలో అవసరమైతే తప్ప లిప్ లాక్ వంటి సన్నివేశాలకు హీరోయిన్లు ఒప్పుకోరు.
కానీ తప్పని పరిస్థితుల్లో కంటెంట్ బాగా రావాలి అంటే ఒప్పుకొని తీరాల్సిందే. అయితే ఈ మధ్యకాలంలో హీరోయిన్లు ఇలాంటివి చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఆ కాలంలో హీరోయిన్లు వీటికి అస్సలు ఒప్పుకునే వారు కాదు. అలా కొంతమంది ఇలాంటి వాటికి అంగీకరించలేక ఏకంగా ఇండస్ట్రీనే వదిలేస్తున్నారు. ఇక అలాంటి వారి గురించి ఇప్పుడు చూద్దాం.
మీరా చోప్రా:
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన బంగారం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈమె తనను ఒక సినిమా షూటింగ్లో ఒక హీరో బలవంతంగా ముద్దు పెట్టాలని అనుకున్నాడట. అయితే ఆమె మాత్రం కుదరదు అని చెప్పగానే మాట మార్చాడట.. అయితే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక పబ్లిసిటీ కోసమే ఇలా చేస్తోందని అందరూ అనుకున్నారు కానీ ఆమెను ఎవరో బెదిరించడం.. మరోవైపు అలాంటి సన్నివేశాలు చేయలేక ఈమె సినిమాలు చేయడం మానేసింది.
జరీనా ఖాన్:
గోపీచంద్ హీరోగా నటించిన చాణక్య సినిమాలో హీరోయిన్గా నటించిన ఈమె చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో వివాదాలతో బాగా పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఒక బాలీవుడ్ హీరో తనతో ముద్దు కోసం బలవంతం పెట్టాడని చెప్పి హాట్ బాంబు పేల్చిన ఈమె గోపీచంద్ గురించి కూడా పుకార్లు సృష్టించింది. దాంతో ఇండస్ట్రీకి దూరమైంది.
మాళవిక:
అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా ద్వారా హీరోయిన్గా రాజేంద్రప్రసాద్ కి జంటగా నటించిన ఈమె ఈ సినిమా సమయంలో రాజేంద్రప్రసాద్ తో చాలా పెద్ద గొడవలే జరిగాయని వెల్లడించింది. ఆయన వల్లే ఇండస్ట్రీ నుంచి దూరమైందనే కామెంట్లు కూడా వినపడ్డాయి. అప్పారావు డ్రైవింగ్ స్కూల్ సినిమా సమయంలో తనతో ముద్దు పెట్టమని ఇబ్బంది పెడుతూ అసభ్యకరంగా నడుచుకున్నాడని చాలా రచ్చ చేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తర్వాత ఇండస్ట్రీకే దూరమైంది.