మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు ఇటీవల క్లింకార అనే పాప పుట్టిన సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆ పాపతో లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు ఉపాసన – రామ్ చరణ్. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
పెళ్లైన రామ్ చరణ్‌ని వలలో వేసుకోవాలని ఓ స్టార్ హీరోయిన్ తెగ ట్రై చేసిందట. ఇంతకీ ఎవరా హీరోయిన్..? రామ్‌చరణ్ కూడా ఆమెను ప్రేమించడా..? లేదా..? ఒకసారి తెలుసుకుందాం. ఇప్పటికే రామ్ చరణ్ ఎంతోమంది స్టార్ హీరోయిన్లతో నటించి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నడు. అలాగే రామ్‌చరణ్ ఓ స్టార్ హీరోయిన్‌తో సినిమాలో నటిస్తున్న టైంలో ఆ హీరోయిన్ రామ్ చరణ్ కు పెళ్లయిందని తెలిసి కూడా ఎలాగైన ఆయనను తన బుట్టలో వేసుకోవాలని తెగ ట్రై చేసిందట.
ప్రతి చిన్న విషయానికి రామ్‌చరణ్ వద్దకు వచ్చి క్లోజ్ గా మాట్లాడటం, క్లోజ్ గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేదట. ఇదంతా అర్ధమైన రామ్ చరణ్ ఆమెతో మాట్లాడినట్లు నటిస్తూనే చివరిలో నువ్వు వేరు.. నేను వేరు.. అనే అర్థం వచ్చేలా ఒకే ఒక డైలాగ్ తో సరిపెట్టేవాడట. అలానే ఆమె వచ్చిన ప్రతిసారి ఉపాసన గురించి గొప్పగా చెబుతూ ఉపాసనని పొగడ్డం చేసేవాడట.
ఆ హీరోయిన్ చివరికి విసుగెత్తి సినిమా రిలీజ్‌కి కొద్దిరోజులు ముందు నుంచి రామ్‌చరణ్‌తో మాట్లాడటం మానేసిందట. ప్రస్తుతం ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరి కోంత మంది డబ్బుల కోసం అవకాశాల కోసం ఇవన్నీ ఇండస్ట్రీలో కామన్‌గానే జరుగుతూ ఉంటాయి అంటూ.. ఇంతకీ ఆ స్టార్ హీరోయిన్ ఎవరు? అంటూ.. కామెంట్లు చేస్తున్నారు.