ఖుషి సినిమాలో సమంత వేసుకున్న చెప్పులు అంత రేటా… వామ్మో కాస్ట్‌లీ…!

తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దశాబ్దంన్న‌ర అవుతున్నా ఇప్పటికి స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే ఉంది సమంత. గత కొంతకాలంగా మ‌యోసైటీస్‌తో బాధపడుతున్న సమంత ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఒప్పుకున్న ప్రాజెక్ట్ షూటింగ్‌ల‌లో పాల్గొంది స‌మంత. నిన్న మొన్నటి వరకు ఖుషి సినిమాతో పాటు బాలీవుడ్ వెబ్ సిరీస్ సిటాడెల్ షూటింగ్‌లో బిజీగా ఉన్న సమంత తాజాగా షూటింగ్‌ల‌న్నీ పూర్తి చేసుకొని సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకుంది.

సమంత డేట్ ఇచ్చిన ప్రాజెక్టులన్ని పూర్తి కావడంతో ఇక ఏ కొత్త సినిమాకు ఒప్పుకోకుండా ప్రస్తుతం తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఈ క్ర‌మంలోనే ఆమె అమెరికాలో ట్రీట్మెంట్ చేయించుకోవాలని నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా విజయ్ దేవరకొండ – సమంత హీరో హీరోయిన్లుగా పాన్ ఇండియా లెవెల్లో తెర‌కెక్కుతోన్న సినిమా ఖుషి.

ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆ తర్వాత.. ఆ సినిమాలోని రెండు పాటలు రిలీజై ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ సంపాదించాయి. ఇక ఈ పాటలో ఎంతో సింపుల్‌గా కనిపించింది సమంత. ఈ సాంగ్‌లో చాలామంది ప్రేక్షకుల దృష్టి అంతా సమంత వేసుకున్న చెప్పులపైనే ఉంది. చూడడానికి అంత సింపుల్‌లుక్ లో అందంగా కనిపిస్తున్న ఈ చెప్పుల రేటు రూ.5899.

ప్రస్తుతం ఈ చెప్పుల ధర సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో షాక్ అవుతున్నారు నెటిజ‌న్స్. ఆ చెప్పులు సమంత లుక్ మరింత పెంచాయంటూ కామెంట్స్ చేస్తున్నారు సమంత ఫ్యాన్స్. ఏదేమైనా స‌మంత‌పై సోష‌ల్ మీడియాలో అటు పాజిటివ్‌గా, ఇటు నెగ‌టివ్‌గా కూడా ట్రెండింగ్ న‌డుస్తూ ఉంటుంది.