ఇండస్ట్రీలో అగ్ర కథానాయకులలో కమల్ హాసన్ ఒకరు. తమిళ్ సినిమాలతో పాటు తెలుగు సినిమాల్లో కూడా హీరోగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కమల్ హాసన్ దర్శకుడుగా, రచయితగా కూడా చెరగని ముద్ర వేసుకున్నాడు. చైల్డ్ ఆర్టిసిగా ఇండస్ట్రీకి పరిచయమైన కమల్ మల్టీ టాలెంటెడ్ స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కమల్ హాసన్ నటించిన తెలుగు సినిమాలలో సాగర సంగమం, స్వాతిముత్యం, శుభ సంకల్పం, ఇంద్రుడు చంద్రుడు లాంటి ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్స్ గా నిలిచాయి.
తమిళ్ డబ్బింగ్ మూవీస్ అయినా సతి లీలావతి , గుణ , దశావతారం , ద్రోహి ప్రేక్షకుల్లో గుర్తుండిపోయాయి. భామనే సత్యభామనే సినిమా కూడా కమల్ హాసన్ కెరీర్ లో మంచి హిట్ ఇచ్చింది. ఇక ఇందులో కమలహాసన్ కూతురుగా నటించిన చిన్ని పాప మీకు గుర్తుండే ఉంటుంది. ఆమె పేరు ఆన్ అన్రా.. 1996లో ఈ సినిమాకు తమిళ నాడు ప్రభుత్వం నుంచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ అవార్డును సంపాదించుకున్న ఈ బ్యూటి బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో కనిపించింది.
ప్రస్తుతం ప్రముఖ బిజినెస్ ఉమెన్ గా రాణిస్తూన్న ఈమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆమె మాట్లాడుతూ కమలహాసన్ గారితో నటించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను అని. ఆయనతో నటించే సమయంలో ఎన్నో నటన పాఠాలను నేర్చుకున్నానని వివరించింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
View this post on Instagram