లావ‌ణ్య త్రిపాఠికి పెళ్లికి ముందే న‌ట్లు బిగించేస్తోన్న మెగా ఫ్యామిలీ… చుక్క‌లు చూపించేస్తోన్నారా…!

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి వీరిద్దరి పేర్లు సోషల్ మీడియాలో కొంతకాలంగా తెగ వైరల్ అవుతున్నాయి. వరుణ్ – లావణ్య పెళ్లి చేసుకోబోతున్నార‌న్న‌ వార్త ఇటీవల సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఇక మెగా ఫ్యామిలీలో పెళ్లంటే మామూలు విషయం కాదు. ఎంత హడావిడి, హంగు ఆర్భాటాలు ఉంటాయో అందరికీ తెలిసిందే. జూన్ నెలలో ఎంగేజ్మెంట్ ఉందంటూ ఇప్పటికే టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది.

Date Fixed for Varun Tej and Lavanya's Engagement

జూన్ 9న వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నారంటూ డేట్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఈ విషయంపై ఇప్పటి వరకు మెగా ఫ్యామిలీ కానీ లావణ్య త్రిపాఠి కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అసలు విషయానికి వస్తే వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి గురించి మరో షాకింగ్ న్యూస్ నెట్టింట‌ వైరల్ అవుతుంది. లావణ్య త్రిపాఠికి పెళ్ళికి ముందే కండిషన్లతో చుక్కలు చూపిస్తున్నాడట వరుణ్ తేజ్.

ఇంతకీ ఏం కండిషన్స్ పెట్టాడో చూద్దాం ? వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠి పెళ్లి లెక్క ప్రకారం ఎప్పుడో జరిగిపోవాలట. లావణ్యకి వరుణ్ పెట్టిన కండిషన్ వల్లే పెళ్లి కాస్త ఆలస్యం అవుతోంద‌ట‌. లావ‌ణ్య‌కి వ‌రుణ్ పెళ్ళి తర్వాత సినిమాల్లోనూ నటించకూడద‌ని ఇప్ప‌టికే చెప్పేశాడ‌ట‌. ఈ కండీష‌న్ విష‌యంలో లావణ్య కాస్త టైం కావాల‌న్నా కూడా పెళ్లికి ముందే ఈ విష‌యంలో ప‌క్కా క్లారిటీతో ఉండాల‌ని ఖ‌రాఖండీగా చెప్పేశాడ‌ట‌.

Lavanya tripathi in a traditional saree at Niharika konidela pellikuthuru  function! | Fashionworldhub

లావ‌ణ్య‌కు పెళ్లి త‌ర్వాత కూడా వెండితెర మీద క‌నిపించాల‌న్న కోరిక ఉన్నా వ‌రుణ్‌తో పాటు మెగా ఫ్యామిలీ ఒత్తిడి ఉండ‌డంతో అయిష్టంగానే ఓకే అన్న‌ట్టు ఇండ‌స్ట్రీలో గుస‌గుస‌లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ త‌ర్వాతే మెగా ఫ్యామిలీ వీరి పెళ్లికి ముహూర్తం ఫిక్స్ చేసింద‌ట‌. ఏదేమైనా మెగా ఫ్యామిలీ ఒత్తిళ్లు అయితే నిహారిక‌పై బాగానే ప‌నిచేశాయి. అప్పుడే ఆమెకు న‌ట్లు బిగించేస్తున్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.