ఆదాశర్మ ..ఈ పేరు చెప్తే జనాలకి అస్సలు గుర్తు రాదు ..ఎవరా ఈ బ్యూటీ అంటూ బుర్ర పీక్కుంటారు. అదే బన్నీ హీరోగా నటించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో సెకండ్ హీరోయిన్ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలో చేసిన రోల్ తోనే గుర్తింపు సంపాదించుకునింది ఈ హాట్ బ్యూటీ. డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన హాట్ అటాక్ చిత్రంతో గ్లామర్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకున్న ఆదాశర్మ.. తెలుగులో బోలెడన్ని సినిమాలు చేసింది .
కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయి ..అయితే ఏ సినిమా కూడా ఆదాశర్మకి నటన పరంగా సక్సెస్ ఇవ్వలేకపోయింది . కేవలం గ్లామర్ క్వీన్ గాని ఆమెను చూపించగలరు డైరెక్టర్ లు. కాగా ఈ క్రమంలోని ఆదాశర్మ గ్లామర్ పాత్రలే కాదు నటన పరంగా ఇంపార్టెన్స్ ఉన్న పాత్రను చేయగలను అంటూ ప్రూవ్ చేసుకోవడానికి తహతహలాడుతుంది . ఇలాంటి క్రమంలోని ఆదాశర్మ ఆశలను నిలబెట్టే రోల్ దక్కింది. ఆదాశర్మ రీసెంట్గా నటిస్తున్న సినిమా “ది కేరళ స్టోరీ”. గత ఏడాది కాశ్మీర్ పండిట్లో మారణకాండ నేపథ్యంలో తెరకెక్కిన కాశ్మీరీ ఫైల్ చిత్రం ఎలాంటి సంచలనాన్ని సృష్టించిందో.. రికార్డు నెలకొల్పిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడు అదే విధంగా ఉంది ఈ కేరళ స్టోరీ . చూస్తుంటేనే ఒళ్ళు వణికిపోతుంది. ఆ విధంగా సేమ్ టు సేమ్ పిన్ టూ పిన్ క్లియర్ గా చూపిస్తున్నాడు . డైరెక్టర్ సుదీప్ సేనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని విపుల్ అమృత్ సేన నిర్మిస్తున్నారు . కేరళ యువత ఉగ్రవాద ముసుగులో చెప్పుకుంటున్న సంఘటనలను మనం ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం . అలాంటి రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిన సినిమానే “ది కేరళ స్టోరీ “.
కాగా ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సీన్లోనూ రియాలిటీని తప్పకుండా చూపించిన డైరెక్టర్ ..ఈ సినిమాలో ఒరిజినల్ కంటెంట్ ని క్లియర్ గా చూపించాడు. మరీ ముఖ్యంగా మతపరమైన సున్నితమైన అంశాలను కూడా ఈ సినిమాలో చూపించడం గమనార్హం. అంతేకాదు ఈ సినిమాకి కర్త – కర్మ – క్రియ మొత్తం ఆదాశర్మనే అయింది . ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్గా రిలీజ్ అయి సంచలనాన్ని సృష్టిస్తుంది .
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది .ఈ పాత్రలో ఆదర్శ టోటల్గా జీవించేసిందని చెప్పాలి. ఒకానొక సందర్భంలో ఆదా శర్మని చూస్తూ ఉంటే బాడీ షివరింగ్ అయిందని అంటున్నారు జనాలు. కచ్చితంగా ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డును తిరగరాస్తుంది అంటూ చెప్పుకొస్తున్నారు . అంతేకాదు ఈ సినిమా మే 5న పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతుంది . చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి హిట్ టాక్ దక్కించుకుంటుందో..?