ఇంట్రెస్టింగ్: బాలయ్య- అనుష్క కాంబోలో మిస్సయిన హిట్ సినిమా ఏమిటో తెలుసా..!

న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో 100వ‌ సినిమాగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వ‌చ్చిన సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి. బాలయ్య తన 100వ‌ సినిమా కోసం ఎలాంటి కథ ఎంచుకోవాలి ఏ దర్శకుడు తో చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్న సమయంలో దర్శకుడు క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణి కథ‌ బాలయ్యకు ఎంత‌గానో నచ్చింది. బాలయ్య చాలా రిస్క్ చేసి తన కెరీర్ లో ప్రతిష్టాత్మకమైన సినిమాకు శాతకర్ణి చక్రవర్తి కథను ఎంచుకోవటం చాలామందికి షాక్ అనిపించింది.

ఈ క‌థ‌కు ముందు బాల‌య్య కృష్ణ‌వంశీతో రైతు సినిమా చేయాలని భావించాడు. అదే స‌మ‌యంలో ఈ సినిమాలో ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్ బచ్చన్ న‌టించ‌డానికి నో చెప్ప‌డంతో ఈ సినిమా అక్క‌డితో అగిపోయింది. అ త‌ర్వాత క్రిష్ చెప్పిన గౌతమీపుత్ర శాతకర్ణికే బాలయ్య ఓటేశారు.. ఆంధ్ర దేశాన్ని పాలించిన 17వ శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది.

ఇక్క‌డ మరో విశేషం ఏంటంటే అదే సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 కు పోటీగా రిలీజ్ అయ్యి మరి శాతకర్ణి హిట్ అయింది. ఆ సంక్రాంతికి యువ హీరో శర్వానంద్ శతమానం భవతి కూడా వచ్చి ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో బాలయ్యకు జంట‌గా మహారాణి పాత్రలో శ్రియా శరణ్ నటించింది. బాలయ్య- శ్రియా కాంబో హిట్ కాంబినేషన్ వీరి కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి -గౌతమీపుత్ర శాతకర్ణి- పైసా వసూల్ వంటి సినిమాలో వచ్చాయి.

అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు నయనతార పేరు వినిపించింది. ఆమె డేట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో క్రిష్ ఎలాగైనా అనుష్కను హీరోయిన్‌గా తీసుకోవాలని అనుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన వేదం సినిమాలో అనుష్క తన నటనతో ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంది. అందుకే ఎలాగైనా అనుష్క ఒప్పించి బాలయ్యకుజంట‌గా నటింపజేయాలని అనుకున్నారు. ఆ స‌మ‌యంలో అనుష్క కూడా బాహుబలి 2, సైజ్ జీరో సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో డేట్లు సర్దుబాటు చేయలేకపోయింది.

దీంతో ఈ అవకాశం శ్రియాకు దక్కింది. ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అయినా గౌతమీ బాలశ్రీ పాత్రకు ప్రముఖ హిందీ నటి హేమమాలిని తీసుకున్నారు. అంతకు ముందు బాలయ్య అనుష్క కాంబినేషన్లో వచ్చిన ఒక్కమగాడు డిజాస్టర్ అయింది. చివరకు శాతకర్ణి లాంటి సూపర్ హిట్ సినిమాలో నటించే అవకాశం అనుష్క మిస్ చేసుకుంది. ఇక ఆ తర్వాత బాలయ్యతో నటించే అవకాశం ఆమెకు ఎప్పుడూ రాలేదు. రాబోయే రోజుల్లో అయినా వీరి కాంబోలో సినిమా వస్తుందో లేదో చూడాలి.